మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చిన ‘హైడ్రా’

మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చిన హైడ్రా

హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసురుతోంది. తాజాగా మాదాపూర్ ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్మించబడిన ఐదు అంతస్తుల భవనం కూల్చి వేసింది హైడ్రా. ఈ భవనం మాదాపూర్ అయ్యప్ప సొసైటీ పరిసరాల్లో 100 ఫీట్ల రహదారికి సమీపంలో ఉంది. హైడ్రా అధికారులు, పోలీసుల సహాయంతో ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు.

కూల్చివేతలకు ముందుగా..
ఈ కూల్చివేతలకు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చిన వెంటనే, హైడ్రా అధికారులు భద్రత చర్యలు చేపట్టారు. భవనం దగ్గర పోలీసులు, హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి ఆందోళనలకు అవకాశమివ్వకుండా చర్యలు చేపట్టారు. పవర్ సప్లై నిలిపివేయడం, ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడం వంటి చర్యలు తీసుకోవడం వల్ల కూల్చివేతలు సజావుగా జరిగాయి.

హైడ్రా ఇప్పటికీ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని నేల‌మ‌ట్టం చేస్తోంది. కొద్దికాలంగా విశ్రాంతిలో ఉన్న హైడ్రా మాదాపూర్ కూల్చివేత‌ల‌తో మ‌రోసారి వార్తల్లో నిలిచింది. త‌రువాత ఏ ప్రాంతంలో ఎలాంటి చ‌ర్య‌ల‌కు పూనుకుంటుందో అని న‌గ‌ర ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment