ఎకరా రూ.177 కోట్లు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త రికార్డు

ఎకరా రూ.177 కోట్లు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త రికార్డు

Summarize with AI

హైదరాబాద్‌ (Hyderabad) రియల్‌ ఎస్టేట్‌ (Real Estate) రంగంలో మరోసారి రికార్డులు బద్దలయ్యాయి. రాయదుర్గం (Rayadurgam) నాలెడ్జ్‌ సిటీ (Knowledge City)పరిధిలోని భూముల వేలం పోటీలో ఊహించని స్థాయిలో బిడ్డింగ్‌ జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని TGIIC (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌) నిర్వహించిన ఈ వేలంలో MSN రియాల్టీ లిమిటెడ్ అత్యధిక ధరకు భూమిని దక్కించుకుంది.

మొత్తం 7.67 ఎకరాల ల్యాండ్‌ పార్సెల్‌ వేలం వేయగా, ప్రతి ఎకరాకు రూ.101 కోట్లు ప్రారంభ ధరగా నిర్ణయించారు. అయితే తీవ్ర పోటీ మధ్య MSN రియాల్టీ ఎకరానికి రూ.177 కోట్లు ఆఫర్ చేసి, రికార్డు స్థాయిలో ఈ భూమి దక్కించుకుంది. ఈ ఒప్పందం మొత్తం విలువ సుమారు రూ.1,356 కోట్లకు చేరుకుంది.

ఈ ధ‌ర‌తో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాయదుర్గం, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ పరిసరాల్లో భూముల ధరలు వేగంగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ డీల్‌ కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది. నిపుణులు భావిస్తున్నట్లు, ఈ ధరలు హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ హబ్‌లలో ఒకటిగా నిలిపే సూచనలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment