నమ్మించి.. నడిరోడ్డుపై పోలీసు జీపులోనే గొంతు కోసి..

నమ్మించి.. నడిరోడ్డుపై పోలీసు జీపులోనే గొంతు కోసి..

సంగారెడ్డి జిల్లాలో (Sangareddy District) అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను, స్వయంగా భర్తే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. జహీరాబాద్ (Zaheerabad) ప్రాంతంలో జరిగిన ఈ ఘాతుకం స్థానికంగా కలకలం రేపుతోంది.

జహీరాబాద్‌కు చెందిన సిద్ధారెడ్డి, కవిత (Kavitha)(29) భార్యాభర్తలు. అయితే, కవిత గత కొంతకాలంగా పవన్ రెడ్డి (Pavan Reddy) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే మార్చి 27న ఆమె తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య కనిపించకపోవడంతో భర్త సిద్ధారెడ్డి (Siddareddy) మార్చి 30న జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, కవిత జడ్చర్లలో (Jadcherla) తన ప్రియుడితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. ఆమెను తిరిగి జహీరాబాద్ తీసుకురావడానికి పోలీసులు సిద్ధారెడ్డిని కూడా వెంటబెట్టుకుని జడ్చర్ల వెళ్లారు.

నందికంది వద్ద నెత్తురోడిన కారు
పోలీసుల సమక్షంలోనే కవితను కారులో జహీరాబాద్‌కు తీసుకువస్తుండగా, సదాశివపేట మండలం నందికంది సమీపానికి రాగానే సిద్ధారెడ్డి ఒక్కసారిగా ఆవేశానికి లోనయ్యాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో (knife) కారులోనే భార్య కవిత గొంతుపై బలంగా పొడిచాడు. రక్తపు మడుగులో ఉన్న కవితను వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది.

ఘటనా స్థలంలో ఉత్కంఠ
పోలీసుల వాహనంలోనే (Police Vehicle) ఈ హత్య జరగడం గమనార్హం. భార్య తనను వదిలి వెళ్ళిందనే కక్షతో సిద్ధారెడ్డి ముందే పథకం ప్రకారం కత్తిని వెంట తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు సిద్ధారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment