పిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో హెడ్‌మాస్టర్ గుంజీలు (వీడియో)

పిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో హెడ్‌మాస్టర్ గుంజీలు (వీడియో)

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని పెంట జెడ్పీ పాఠశాలలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ప్ర‌భుత్వ‌ పాఠశాల హెడ్‌మాస్టర్ రమణ, విద్యార్థులు చదువులో వెనుకబడిపోతున్నారని తీవ్ర ఆవేదనతో, వాళ్ల ముందు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. పిల్లలు చదువులో సరైన పురోగతి చూపడం లేదని, తల్లిదండ్రులు కూడా వాళ్లపై సరైన కంట్రోల్ పెట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

‘మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది’ అని హెడ్‌మాస్టర్ రమణ ఉద్వేగంగా పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. పిల్లల భవిష్యత్తుపై ఆయన చూపించిన ఆందోళనను పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై మరింత శ్రద్ధ వహించాలని, హెడ్‌మాస్టర్ రమణ చేసిన విజ్ఞప్తిని సీరియస్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment