హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. అఫ్గాన్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం

హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. అఫ్గాన్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం

Summarize with AI

బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో(BCCI Centre of Excellence) ఫిట్‌నెస్(Fitness, బౌలింగ్‌పై (Bowling)తీవ్రంగా సాధన చేస్తున్న హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) తాజాగా లెగ్‌లో స్వల్ప అసౌకర్యం(Discomfort) తలెత్తినట్లు సమాచారం. పూర్తి తీవ్రతతో బౌలింగ్ చేస్తున్న సమయంలో ఎలాంటి పెద్ద ఇబ్బంది లేకపోయినా, తాజా సమస్యతో కొంతకాలం బౌలింగ్‌కు దూరంగా ఉండాలని వైద్య బృందం (Medical Team)సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు హార్దిక్ అందుబాటుపై సందేహాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం హార్దిక్ బ్యాటింగ్, కదలికల్లో పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ.. పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు నిర్ధారించుకున్న తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సీఓఈ(COE) భావిస్తోంది. ఈ వారం సెలెక్టర్లు జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో హార్దిక్ ఫిట్‌నెస్‌పై వారికి నివేదిక అందనుంది. 2026 ఐపీఎల్‌లో(IPL) మే 24న ముంబై ఇండియన్స్ తరఫున చివరి మ్యాచ్ ఆడిన హార్దిక్.. భారత్ తరఫున మార్చి 8న టీ20 ప్రపంచకప్ ఫైనల్లో చివరిసారిగా బరిలోకి దిగాడు. తాజా లెగ్ సమస్య అతడి అంతర్జాతీయ పునరాగమనాన్ని మరింత ఆలస్యం చేసే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment