గుడివాడలో ఉద్రిక్త‌త‌.. జెడ్పీ చైర్ ప‌ర్స‌న్‌పై హ‌త్యాయ‌త్నం

గుడివాడలో ఉద్రిక్త‌త‌.. జెడ్పీ చైర్ ప‌ర్స‌న్‌పై హ‌త్యాయ‌త్నం

కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ (Gudivada)లో టీడీపీ (TDP), జనసేన (Janasena) కార్యకర్తలు (Activists) దాడి (Attack) రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. నాగవరప్పాడు జంక్షన్ వద్ద జడ్పీ చైర్‌పర్సన్ (ZPP Chairperson) ఉప్పాల హారిక (Uppala Harika) వాహనాన్ని చుట్టుముట్టిన టీడీపీ, జనసేన గూండాలు కర్రలు, రాడ్లతో దాడి చేసి, తీవ్ర దుర్భాషలాడారు. టీడీపీ నేత‌ల అస‌భ్య‌క‌ర దూష‌ణ‌ల‌కు జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ ఉప్పాల హారిక క‌న్నీటి ప‌ర్యంత‌మైన సంఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. దూష‌ణ‌లు, దాడి సమయంలో పోలీసులు(Police) అక్కడే ఉన్నప్పటికీ, వారు టీడీపీ, జ‌న‌సేన ఆందోళ‌న‌కారుల‌ను నియంత్రించకుండా సహకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటనలో ప్రాణభయంతో హారిక తన భర్త, పెడన వైసీపీ ఇన్‌చార్జ్ ఉప్పాల రాము (Uppala Ramu)తో కలిసి గంటన్నర పాటు కారులోనే ఉండిపోయారు. ఈ దాడిపై హారిక, రాము గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడి సమయంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు “కారు దిగండి, చంపేస్తాం, నరికేస్తాం” అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు హారిక తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా జిల్లా ప్రథ‌మ పౌరురాలైన తనపై ఇష్టానుసారంగా దూషణలు, దాడులు జరిగినా పోలీసులు రక్షణ కల్పించలేదని ఆమె కన్నీటి పర్యంతమైన సందర్భంలో వాపోయారు. ఈ ఘటన వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. “జిల్లా ప్రథ‌మ పౌరురాలికే భద్రత లేకుండా పోలీసులు అధికార పార్టీల‌కు కొమ్ముకాస్తున్నారు. ఇది చట్ట వ్యవస్థ కుప్పకూలినట్లు చూపిస్తోంది” అని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ దాడిని ఖండిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది.

వైసీపీ ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ’ కార్యక్రమం నేపథ్యంలో జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ హారిక‌, ఆమె భ‌ర్త పెడ‌న నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్ రాముతో క‌లిసి గుడివాడ చేరుకున్న స‌మ‌యంలో ఈ దాడి జ‌రిగింది. అంత‌కు ముందు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు పేర్ని నానిని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా, పోలీసులు ఆయ‌న్ను హౌస్ అరెస్ట్ చేశారు. గుడివాడ‌లో పేర్ని నాని (Perni Nani) కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను సైతం టీడీపీ నేత‌లు ధ్వంసం చేసి, పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. జెడ్పీ చైర్ ప‌ర్స‌న్‌పై దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో మరింత వివాదానికి దారితీసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment