ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ (Ebola Virus) మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీలోని(AP) గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం (Gannavaram International Airport) అప్రమత్తమైంది. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి, కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. గన్నవరం ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించారు.
ఆఫ్రికా ప్రయాణికులపై ప్రత్యేక నిఘా
ముఖ్యంగా ఆఫ్రికా దేశాలైన కాంగో(Congo), ఉగాండా (Uganda) నుంచి వచ్చే ప్రయాణికులపై వైద్య సిబ్బంది, ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకుల పాత ట్రావెల్ హిస్టరీ (Travel History) ఆధారంగా ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆఫ్రికా దేశాల మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో వచ్చే వారిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
సింగపూర్ ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్
ఇందులో భాగంగానే, ఇటీవల సింగపూర్ (Singapore) నుంచి 185 మంది ప్రయాణీకులతో గన్నవరం చేరుకున్న అంతర్జాతీయ విమానంలోని ప్రయాణికులందరికీ ఎయిర్‌పోర్ట్ వైద్య బృందం కఠినమైన థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను (Thermal Screening Tests) నిర్వహించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులలో ఎవరికైనా ఎబోలా లక్షణాలు (తీవ్రమైన జ్వరం, అలసట, కండరాల నొప్పులు, వాంతులు) కనిపిస్తే, వారిని తక్షణమే ఐసోలేట్ (Isolate) చేయడానికి ఎయిర్‌పోర్టులో ప్రత్యేక మెడికల్ క్యాంపులను, అంబులెన్స్ సేవలను సిద్ధంగా ఉంచారు.
ఎబోలా అత్యంత ప్రమాదకరమైన వైరస్ కావడంతో ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో శానిటైజేషన్ ప్రక్రియను ముమ్మరం చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులు తమ ట్రావెల్ హిస్టరీని దాచకుండా అధికారులకు పూర్తి వివరాలు అందించి వైద్య పరీక్షలకు సహకరించాలని ఎయిర్‌పోర్ట్ అధికారులు కోరుతున్నారు.









‘నీ కుటుంబంపై నిందలేస్తుంటే నువ్వెక్కడమ్మా షర్మిలమ్మా..?’