---Advertisement---

ఉచిత బస్సు పథకం మాట‌ల‌కే ప‌రిమిత‌మా..? వైఎస్ ష‌ర్మిల ప్ర‌శ్న‌

ఉచిత బస్సు పథకం మాట‌ల‌కే ప‌రిమిత‌మా..? వైఎస్ ష‌ర్మిల ప్ర‌శ్న‌
---Advertisement---

ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో పండుగలు, ఇతర కార్యక్రమాల పేరుతో ఈ పథకాన్ని ఆలస్యం చేశారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం కేబినెట్ సబ్‌కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇతర రాష్ట్రాలతో పోల్చి ప్రశ్నల వర్షం
“తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు పథకాన్ని అమలు చేశాయి. ఉన్న బస్సుల్లోనే ఉచిత ప్రయాణం కల్పించి, అవసరమైతే అదనపు ఏర్పాట్లు చేశాయి. అయితే, ఆర్టీసీకి నిధులు ఇవ్వడానికి మీ ప్రభుత్వానికి అంత ఇబ్బందా ఎందుకు? మహిళల భద్రతకు మీకు పట్టువుందా?” అని చంద్ర‌బాబు నేతృత్వంలోనే కూట‌మి ప్ర‌భుత్వాన్ని వైఎస్ ష‌ర్మిల‌ ప్రశ్నించారు.

మీ చిత్తశుద్ధి నిరూపించండి
ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని వెంటనే అమలు చేయాలని, లేదంటే కనీసం కొత్త సంవత్సర కానుకగా ఈ పథకాన్ని ప్రారంభించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. “మహిళల కోసం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారో లేదో చూడాలి” అంటూ ప్రభుత్వంపై ష‌ర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment