---Advertisement---

‘వ‌డ్డీతో స‌హా తిరిగిస్తా..’ – విడ‌ద‌ల ర‌జిని మాస్ వార్నింగ్‌

'వ‌డ్డీతో స‌హా తిరిగిస్తా..' - విడ‌ద‌ల ర‌జిని మాస్ వార్నింగ్‌
---Advertisement---

టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత విడ‌ద‌ల ర‌జిని సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. త‌న‌ కుటుంబం జోలికి వచ్చినా, వైసీపీ కార్యకర్తలు జోలికి వచ్చిన సహించే ప్రసక్తే లేదని ధ్వ‌జ‌మెత్తారు. చిల‌క‌లూరిపేట‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించిన మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని.. వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై, త‌న కుటుంబ స‌భ్యుల‌పై త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తున్న ఎమ్మెల్యే పుల్లారావుకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

‘విద్యుత్‌ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రాలు ఇచ్చాం. ఆ ఘటనలోనూ నాతో సహా పార్టీకి చెందిన 30 మందిపై అక్రమ కేసులు పెట్టారు. పోలీస్‌ వ్యవస్థ టీడీపీకి అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోంది. నియోజకవర్గంలోని వైసీపీ నాయ‌కులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. 80 ఏళ్ల వయసున్న మా మామపై, విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటున్న మా మరిదిపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. గడిచిన ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఏనాడూ ప్రత్తిపాటి పుల్లారావు మాదిరిగా అనైతిక చర్యలకు పాల్పడింది లేదు. ప్రత్తిపాటి నా కుటుంబంతోపాటు, మా పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారు’.

‘టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అధికారాన్ని అడ్డం పెట్టుకుని 2014 నుంచి 2019 వ‌ర‌కు చేసిన అరాచకాలు, అక్రమాలుపై నేను దృష్టి పెట్టి ఉండి ఉంటే నువ్వు ఎక్కడ ఉండేవాడు గుర్తుపెట్టుకో పుల్లారావు. నా ఏడేళ్ల రాజకీయ అనుభవం ముందు పుల్లారావు పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం తలవంచింది. కేసులు పెట్టి వేధించినంత మాత్రాన వైసీపీ భయపడి వెనక్కి తగ్గదు. మరింత బలంగా ఢీకొంటాం. పుల్లారావు చేసిన అరాచకాలకు వడ్డీతో సహా తిరిగిస్తా. ప్రత్తిపాటి అండతో రెచ్చిపోతున్న ఎవర్నీ వదిలిపెట్టేది లేదు. అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులకు కూడా త‌గిన మూల్యం తప్పదు. మా ప్రభుత్వం వచ్చిన రోజున ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుందని గుర్తుంచుకో..’ అని విడ‌ద‌ల ర‌జిని ప్ర‌త్తిపాటి పుల్లారావుకు వార్నింగ్ ఇచ్చారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment