ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అధునాతన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన కుమారుడు పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. హరిచందన్‌కు నిపుణులతో కూడిన వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తుంది.
బిశ్వభూషణ్ హరిచందన్ ఒడిశాకు చెందిన సీనియర్ BJP నాయకుడు. 2019 నుండి 2023 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. ప్రజా సేవలో సుదీర్ఘకాలంగా పనిచేశారు. విధేయత మరియు పట్టుదలతో తన బాధ్యతలు నిర్వర్తించిన హరిచందన్ అనారోగ్యం వార్త రాష్ట్ర ప్రజల్లో ఆందోళన కలిగించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.








అవసరమైతే తెలంగాణ అంతా తిరుగుతా: పవన్