జగన్ 2.0 ప్రకటనతో మంచి జోష్ మీదున్న వైసీపీ క్యాడర్‌కు మరింత జోరందించే వార్త ఒకటి రాజకీయ వర్గాల్లో సంచరిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తరువాత ప్రతిపక్షం కూర్చున్న వైసీపీ నేతలను అధికార పార్టీలు ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. నేతలను తమవైపునకు తిప్పుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి ఊరటనిచ్చే అంశం ఒకటి ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీసీపీ మాజీ చీఫ్ శైలజానాథ్ వైసీపీలో చేరబోతున్నట్లుగా సమాచారం. జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు శైలజానాథ్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. గతంలోనూ ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినప్పటికీ ఈసారి మాత్రం శైలజానాథ్ ఎంట్రీ పక్కా అని తెలుస్తోంది. రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు రెడీ అయినట్లుగా సమాచారం.
గత డిసెంబర్‌లో కర్నూల్‌లో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో జగన్‌ను కలిశారు శైలజానాథ్. జగన్‌తో ఆప్యాయంగా మాట్లాడి ఆలింగనం చేసుకున్నారు. దీంతో శైలజానాథ్ వైసీపీలో చేరడం ఖాయమని అనుకున్నారంత. కానీ, ఆయన కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు. రాజకీయాల్లో క్రియాశీలక నేతగా ఎదిగేందుకు వైసీపీ మాత్రమే సరైన వేదిక అని నిర్ణయించుకొని ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.