ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కూటమి పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన ఐదుగురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు స్థానాలకు గానూ జనసేన నుంచి నాగబాబు, టీడీపీ నుంచి బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, అలాగే బీజేపీ నుంచి సోము వీర్రాజు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా జంగా కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్‌బాబు, తిరుమల నాయుడు, రామారావు రిటైర్ ఈనెలాఖరుతో రిటైర్ కానున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ త్వరలో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.