అమరావతి పునర్నిర్మాణం (Amaravati reconstruction) శుక్రవారం ప్రధానమంత్రి మోడీ (Prime Minister Modi) చేతుల మీదుగా ప్రారంభమైంది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ప్రధాని మోడీ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రధాని మోడీ సభా ప్రాంగణానికి సమీపంలో కేవలం 3 కిలోమీటర్ల దూరంలో భారీ అగ్నిప్రమాదం (Major Fire Accident) చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా (Guntur District) తుళ్ళూరు మండలంలోని మందడం గ్రామంలో ఈ ఘటన జరిగింది.
పంట పొలాల్లో ఉన్న పైపులకు మంటలు అంటుకోవడంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రధాని మోడీ సభ జరుగుతున్న సమయంలో ఇలా సమీపంలో అగ్ని ప్రమాదం జరగడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు.
అమరావతి మందడం సమీపంలో భారీగా పొగ
— Telugu Feed (@Telugufeedsite) May 2, 2025
అగ్నిప్రమాదంగా భావిస్తున్న పోలీసులు
ప్రధాని సభ మూడు కిలోమీటర్ల దూరంలో ప్రమాదం#AndhraPradesh #AmaravatiRelaunch pic.twitter.com/gmAPFspZNl