ఆంధ్రప్రదేశ్ అప్పులపై ఇన్నాళ్లుగా ఏపీ ప్రజల్లో ఏర్పడిన గందరగోళానికి తెరపడింది. రూ.10 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అని ప్రచారం చేస్తున్న అబద్ధాల బుడగ అసెంబ్లీ సాక్షిగా బద్ధలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు ఎంత అని ప్రశ్నిస్తూ వైసీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్, ఆకేపాటి అమర్నాథ్, మత్స్యరస విశ్వేశ్వరరాజు ఫైనాన్స్ మినిస్టర్‌కు ప్రశ్న వేశారు. వైసీపీ సభ్యుల ప్రశ్నకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నుంచి లిఖితపూర్వక సమాధానం విడుదలైంది.
ఫైనాన్స్ మినిస్టర్ సమాధానంలో రాష్ట్ర అప్పులపై క్లారిటీ వచ్చింది. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.5,19,192 కోట్లు మాత్రమే కాగా, ప్రభుత్వ రంగ సంస్థలు అప్పులు 1,58,657 కోట్లు. కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేసిన మొత్తం అప్పులు 3,39, 580 కోట్లు మాత్రమేని అసెంబ్లీ సాక్షిగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ విడుదల చేసిన సమాధానంలో వెల్లడైంది. ఇందులో వైఎస్ జగన్ హయాంలో చేసిన పబ్లిక్ అప్పులు రూ.2,34,225 కోట్లు కాగా, కార్పొరేషన్లు ద్వారా చేసిన అప్పులు రూ.1,05,355 కోట్లు మాత్రమే అని తేలిపోయింది.
ఇందులో గత చంద్రబాబు హయాంలో చేసిన అప్పులను కూడా ప్రస్తావిచారు. 2014-19 మధ్య చంద్రబాబు రూ.2,57,509 కోట్లు కాగా, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు రూ.49,442 కోట్లుగా ఉంది. 2019-24 మధ్య ఐదేళ్ల వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పు రూ.3,39, 580 కోట్లు మాత్రమేనని, వైసీపీ దిగిపోయే నాటికి అప్పు రూ.5,19,192 కోట్లు అని అందులో పొందుపరిచారు. కాగా, అప్పులపై ఎన్నికల సమయంలో రూ.14 లక్షల కోట్లు, రూ.12 లక్షల కోట్లు, రూ.10 లక్షల కోట్లు అంటూ కొన్ని రాజకీయ పార్టీలు తప్పు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కాగా, అప్పులపై చేసిన దుష్ప్రచారం శాసనసభ సాక్షిగా బట్టబయలు అయ్యింది.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేసిన మొత్తం అప్పులు 3,39, 580 కోట్లు మాత్రమే
— Telugu Feed (@Telugufeedsite) March 7, 2025
వైసీపీ ఎమ్మెల్యేల ప్రశ్నకు ఆర్థికమంత్రి ప్రకటన
జగన్ హయాంలో చేసిన పబ్లిక్ అప్పులు 2,34,225 కోట్లు మాత్రమే
కార్పొరేషన్లు ద్వారా చేసిన అప్పు రూ.1,05,355 కోట్లు మాత్రమే @YSRCParty @JaiTDP #AndhraPradesh pic.twitter.com/7hevhSzXMW