సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొల్పిన చిత్రం ‘కుబేర’(Kubera) తాజాగా ఓటీటీ(OTT) డీల్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ధనుష్(Dhanush), రష్మిక మందన్నా(Rashmika Mandanna) జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 20న పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్
తాజా సమాచారం ప్రకారం, ‘కుబేర’ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రం మొదట థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన తర్వాత మాత్రమే ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.
ప్రముఖ నటుల కాంబినేషన్, శేఖర్ కమ్ముల(Shekhar Kammula) మార్క్ స్టోరీటెల్లింగ్‌తో ‘కుబేర’ సినిమాపై భారీ హైప్ నెలకొంది. థియేటర్లలో ఈ సినిమా ఎంతమేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి.