చాహల్‌తో విడాకులు.. గృహహింసపై ధనశ్రీ సాంగ్

చాహల్‌తో విడాకులు.. గృహహింసపై ధనశ్రీ సాంగ్

Summarize with AI

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ధనశ్రీ వర్మ తమ వైవాహిక బంధాన్ని ముగింపు ప‌లికారు. ముంబై ఫ్యామిలీ కోర్టు వీరి జంట‌కు విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నడుమ, ధనశ్రీ తాజాగా గృహహింసపై స్పందిస్తూ ఓ ప్రత్యేకమైన పాటను విడుదల చేశారు.

బాధితురాలి పాత్ర‌లో..
‘దేఖా జీ దేఖా మైనే’ అనే టైటిల్‌తో విడుదలైన ఈ ప్రైవేట్ ఆల్బమ్‌లో, ధనశ్రీ గృహహింసకు గురైన బాధితురాలి పాత్రలో కనిపించారు. భర్త చేతిలో మోసపోయిన ఓ మహిళగా, ఆ బాధను ప్రతిబింబించేలా ఆమె ప్రదర్శన ఉంది. ఈ పాట యూట్యూబ్‌లో వైరల్ అవుతూ, నెటిజన్లను ఆకర్షిస్తోంది. పాట ద్వారా ధనశ్రీ వ్యక్తిగత అనుభవాలను పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారా? అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment