IPL-2025: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

IPL-2025: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

Summarize with AI

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(IPL) 18వ సీజన్ కోసం సిద్ధమవుతోంది. మ‌రికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఫ్రాంచైజీ టీమ్స్‌ల‌లో కొత్త‌కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్ నియమితుడయ్యాడు. ఫ్రాంచైజీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.

2019 నుంచి ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పటేల్, ఇప్పటి వరకు 150 IPL మ్యాచ్‌లు ఆడి 1,653 పరుగులు చేయడంతో పాటు 123 వికెట్లు సాధించారు. బౌలింగ్, బ్యాటింగ్‌లో సమతూకం కలిగిన ఈ ఆల్‌రౌండర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడంపై అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు.

కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడాన్ని నిరాకరించడంతోనే ఫ్రాంచైజీ అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. 2025 సీజన్‌లో అతని నాయకత్వంలో ఢిల్లీ ఎలా రాణిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment