ఢిల్లీ అసెంబ్లీలో పరిస్థితులు గందరగోళంగా మారాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యేలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు సీఎం కార్యాలయం నుంచి తొలగించారంటూ ఆందోళనకు దిగారు. శాసనసభ ప్రారంభమైన వెంటనే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగిస్తున్న సమయంలో AAP నేతలు నిరసనలు చేపట్టారు. దీని ఫలితంగా స్పీకర్ విజేందర్ గుప్తా ఆతిశీ సహా 12 మంది AAP ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.
మద్యం కుంభకోణంపై ఉత్కంఠ
ఢిల్లీ మద్యం కుంభకోణంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ఆడిట్ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ గందరగోళం నెలకొంది. AAP ఆరోపించినట్లుగా BJP ప్రభుత్వం ఈ CAG నివేదిక దృష్టిని మరల్చడానికి ఈ గందరగోళాన్ని సృష్టించిందని అధికార పార్టీ పేర్కొంది. లిక్కర్ స్కామ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.2,026 కోట్లు నష్టం, ప్రణాళిక రూపకల్పనలో పారదర్శకత లేకపోవడం, ఫిర్యాదులు వచ్చినా బిడ్డింగ్‌ను అనుమతించటం, ఉల్లంఘనలకు జరిమానా విధించకపోవడం వంటి అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది.








