పనివేళలపై దీపిక డిమాండ్‌కి షాలిని సపోర్ట్‌

పనివేళలపై దీపిక డిమాండ్‌కి షాలిని, కొంకణ సపోర్ట్‌

సినీ పరిశ్రమ (Cinema Industry)లో పని చేసే సమయాల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ విషయంలో బాలీవుడ్‌ అగ్ర తారలు సైతం తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నటి దీపికా పదుకొణె (Deepika Padukone)’రోజుకు ఎనిమిది గంటల పనివేళలు’ ఉండాలనే డిమాండ్‌తో ముందుకొచ్చింది. మిగతా రంగాల మాదిరిగానే చిత్ర పరిశ్రమలో కూడా సమతుల్యమైన వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్ ఉండాలని ఆమె కోరుకుంటోంది.

అయితే, ఈ డిమాండ్‌ చిన్న, మధ్య తరహా చిత్రాలకు సరిపోవచ్చని, కానీ భారీ బడ్జెట్‌ సినిమాల్లో దీన్ని అమలు చేయడం కష్టమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ పనివేళల విషయంలో అంగీకారం కుదరకపోవడం వల్లే దీపికా ‘స్పిరిట్‌’, (Spirit) ‘కల్కి (Kalki) 2898 ఏడీ’ వంటి పెద్ద ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం.

షాలిని పాండే మద్దతు:

ఈ అంశంపై తాజాగా యంగ్ హీరోయిన్ షాలిని పాండే (Shalini Pandey) స్పందించింది. ఆమె మాట్లాడుతూ, “నాకు దీపికా పదుకొణె అంటే చాలా ఇష్టం. నేను స్కూల్‌ రోజులనుంచే ఆమెను ఫాలో అవుతున్నాను. ఆమె కెరీర్‌ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. తనకు ఏది సరైనదో దాని గురించి ఎంతో ధైర్యంగా మాట్లాడతారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా మందికి ధైర్యాన్ని ఇచ్చాయి. ఆమె వల్లే ఇప్పుడు మేమంతా కూడా మా మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడగలుగుతున్నాం. దీపిక అడిగితే అది ఇవ్వాల్సిందే అనిపిస్తుంది. ఆమె కోరుకున్నది దక్కడం ఆమె హక్కే” అని పేర్కొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment