దూసుకొస్తోన్న‌ ‘దిత్వా’ తుపాన్.. ఏపీ-తమిళనాడుకు హెచ్చరికలు

దూసుకొస్తోన్న‌ ‘దిత్వా’ తుపాన్.. ఏపీ-తమిళనాడుకు హెచ్చరికలు

Summarize with AI

ఏపీ (AP)కి మ‌రో తుఫాన్ (Cyclone) గండం ముంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) మరింత బలపడి తుపానుగా మారింది. ఈ తుపాన్‌కు భారత వాతావరణ విభాగం (IMD) ‘దిత్వా (Ditva)’ అనే పేరు పెట్టింది. గత ఆరు గంటల్లో ఇది గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలింది. ప్రస్తుతం ఈ తుపాన్ ట్రింకోమలీ (శ్రీలంక) (Trincomalee – Sri Lanka)కి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

IMD అంచనా ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున నుండి మధ్యాహ్నం వరకు ఈ తుపాన్ తమిళనాడు, పుదుచ్చేరి (Puducherry) మరియు దక్షిణ ఆంధ్ర తీరం (నెల్లూరు–తిరుపతి ప్రాంతం) (Nellore–Tirupati) వైపున‌కు చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శనివారం, ఆదివారం రోజుల్లో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) నివేదిక ప్రకారం, దక్షిణ కోస్తా జిల్లా, నెల్లూరు, తిరుపతి, ప్రకాశంతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా రేపటి నుంచి మోస్తరు వర్షాలు, ఎల్లుండి భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 50–70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మత్స్యకారులకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేస్తూ, వచ్చే 48 గంటల పాటు బంగాళాఖాతంలో వేటకు వెళ్లకూడదని ఆదేశించారు. రైతులు కూడా పంటలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు, గాలులతో నష్టాలు సంభవించే అవకాశం ఉండడంతో అధికారులు 24 గంటలు మానిటరింగ్ కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment