తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈనెల 13న ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లి 16న స్విట్జర్లాండ్‌లో జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనాల్సి ఉంది. కానీ, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆయన ఆస్ట్రేలియా టూర్‌ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 14న ఢిల్లీకి వెళ్తారు. 15న జరుగనున్న AICC కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 16న స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్తారు. అక్కడ జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. రాష్టానికి పెట్టుబడి ఆహ్వానించడమే లక్ష్యంగా అక్కడ పారిశ్రామిక వేత్తలతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. తెలంగాణలోని వనరులు, పరిశ్రమలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహాన్ని వివరించారు. సదస్సు ముగించుకొని ఈనెల 24న ఆయన తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.
News Wire
-
01
వైసీపీ ఎమ్మెల్యేకి బెయిల్
ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. 68 రోజుల నుంచి జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్యే విరుపాక్షి
-
02
CECకి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ నివాసం వద్ద పటిష్ఠ బందోబస్తు. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో జెడ్ ప్లస్ భద్రత కేటాయించిన కేంద్ర హోంశాఖ
-
03
ఏపీలో అతిపెద్ద ఓట్ చోరీ
ఏపీలో అతిపెద్ద ఓట్ చోరీ స్కాం జరిగిందని వైసీపీ నేత వాసుపల్లి గణేష్ ఆరోపణ. దొంగఓట్లతో కూటమి నాయకులు గెలిశారని మండిపాటు
-
04
విజయవాడలో మహిళ దారుణ హత్య
అరండల్ పేటలో ఘటన. మృతురాలు సునీతగా గుర్తింపు. సునీతను దారుణంగా కత్తితో పొడి హత్య చేసిన నిందితుడు నాగరాజు
-
05
ఇండియా కూటమి లంచ్ మీటింగ్
సాగర్ రత్న హోటల్ లో ఇండియా కూటమి ఎంపీల లంచ్ మీటింగ్. మరోసారి ఈసీ కార్యాలయం వరకు వెళ్లే యోచనలో కూటమి ఎంపీలు
-
06
ఈనెల 9న విచారణ
ఏపీలో బీసీ రిజర్వేషన్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఈనెల 9న విచారణ. ఏపీ హై కోర్టు తీర్పును సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
-
07
శ్రీసిటీలో ఘోర ప్రమాదం
తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో పేలుడు. బాయిలర్ పేలడంతో నలుగురు మృతి.. మృతులు సంఖ్య పెరిగే అవకాశం
-
08
ఢిల్లీలో హైటెన్షన్
సీజేపీ ఆందోళనల నేపథ్యంలో 11 మెట్రో స్టేషన్ల మూసివేత. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్
-
09
గాంధీ విగ్రహానికి ఘోర అవమానం
శ్రీకాకుళం జిల్లాలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసి చెత్తకుప్పల్లో వేసిన వైనం. విగ్రహాన్ని ధ్వంసం చేసిన మందుబాబులు
-
10
పడిపోయిన భారత స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లకు వరుసగా 8వ వారం నష్టాలు.. 25 ఏళ్లలో తొలిసారి.








