అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్ రెడ్డి.

అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్ రెడ్డి.

Summarize with AI

తెలంగాణ ఉద్యమానికి తన పాటలతో ఊపిరి పోసిన సహజ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. కవిని కడసారి చూసేందుకు అభిమానులు, సాహితీ ప్రియులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అందెశ్రీ అంత్యక్రియలకు హాజరై, ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అంతేకాకుండా, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అందెశ్రీ పాడెను మోసి తన గౌరవాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అందెశ్రీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, పలువురు కాంగ్రెస్ నాయకులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ కవికి అధికారిక గౌరవం దక్కింది. అంత్యక్రియల సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించి, అనంతరం గాల్లో మూడు రౌండ్ల కాల్పులు జరిపి తమ గౌరవాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సేవలకు దక్కిన ఈ గౌరవం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment