నేడు ఢిల్లీకి చంద్రబాబు – పవన్.. ఎందుకంటే..

నేడు ఢిల్లీకి చంద్రబాబు - పవన్.. ఎందుకంటే..

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు మ‌రోసారి ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈనెల‌లో 18 రోజుల్లోనే చంద్ర‌బాబు మూడోసారి ఢిల్లీ వెళ్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఢిల్లీ బ‌య‌ల్దేరుతారు. రాత్రి 6.30కి చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొననున్న సీఎం, డిప్యూటీ సీఎం, రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. బుధ‌వారం కూడా ఢిల్లీలో వీరి ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది.

బుధ‌వారం ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమరావతి నిర్మాణ పునఃప్రారంభంపై ప్రధానిని ఆహ్వానించనున్నారు. రాజధాని నిధుల సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు జరపనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment