ఏపీ (AP) సీఎం (CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)పై మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్ (Dr.Chinta Mohan) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయన ఎత్తిచూపారు. కూటమి పాలనలో అంటరానితనం స్పష్టంగా కనిపిస్తోందని, ముఖ్యంగా టీటీడీ(TTD) వంటి సంస్థల్లో దళిత అధికారులే కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు అనుసరిస్తున్న మార్గం తప్పని, పొరుగు రాష్ట్ర సీఎం స్టాలిన్ (CM Stalin)ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.
గిరిజనులపై (Tribals) జరుగుతున్న అణచివేతలపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకు పరిసర ప్రాంతాల్లో గిరిజనులపై దాడులు పెరిగినట్టు చెప్పారు. కొన్ని ఘటనల్లో పురుషాంగాలు కోసినట్లు వార్తలు వచ్చాయని చెప్పారు. ఎస్టీలకు కూటమి పాలనలో జరుగుతున్న అన్యాయం చెప్పలేనిదని ఆయన అన్నారు. మొత్తంగా చంద్రబాబు పాలన సామాజిక న్యాయానికి దూరంగా ఉందని తీవ్రంగా మండిపడ్డారు. కుప్పం(Kuppam)లో ఒక టిఫిన్ హోటల్ కూడా కనిపించలేదని, అలాంటి స్థితిలో ఉన్న చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి చేశానని చెప్పడం నమ్మశక్యం కాదని విమర్శించారు.
2024 ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. అమరావతి రాజధాని నిర్మాణంపై తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. రైతులు భూములు సంతోషంగా ఇవ్వలేదని, అవినీతి ముద్ర పడిన ప్రాజెక్ట్‌గా అమరావతి మారిందన్నారు చింతా మోహన్. తల్లికి వందనం పధకం అమలు చేసి భార్య భర్తల మధ్య చంద్రబాబు గొడవలు పెట్టాడన్నారు.








