ఛత్తీస్‌గఢ్‌లో స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. పలువురి మృతి

ఛత్తీస్‌గఢ్‌లో స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. పలువురి మృతి

Summarize with AI

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ముంగేలీ జిల్లాలోని ఓ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న చిమ్నీ కుప్పకూలి పలువురి ప్రాణాలు తీసింది. ఈ ప్రమాదంలో చాలా మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 25 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం ప్రకారం. సంఘటన గురించి తెలిసిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు మరియు పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ప్రారంభించాయి. ఈ ప్రాంతంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం కోసం ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. ప్ర‌మాదం ఎలా జ‌రిగింది, ఎంత‌మంది చ‌నిపోయార‌నే దానిపై ఇంకా స్పష్ట‌త రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment