జనసేన పార్టీ సీనియర్ నేత, ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూటమి పార్టీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల ఇంకా కీలక కామెంట్లు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ మాత్రమే కాకుండా, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి టీడీపీకి అండగా నిలబడ్డారని తెలిపారు.
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, జనసేన కార్యకర్తల శ్రమ వలననే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగామన్నారు. ఒక్క ఓటు కూడా చీలకుండా టీడీపీకి మద్దతుగా పనిచేసి, కూటమికి ఘనవిజయం సాధించారని స్పష్టం చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలను తెలుగు దేశం తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.








