సీఎం సింగ‌పూర్ టూర్ @ 58వ ‘సారీ’

సీఎం సింగ‌పూర్ టూర్ @ 58వ 'సారీ'

ఏపీ (AP) ముఖ్య‌మంత్రి (Chief Minister) చంద్ర‌బాబు నాయుడి (Chandrababu Naidu’s) సింగ‌పూర్ (Singapore) ప‌ర్య‌ట‌న నేటితో ముగియ‌నుంది. పెట్టుబ‌డుల (Investments) కోసం సింగ‌పూర్‌ (Singapore)లో వేట కొన‌సాగించిన చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌పై సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా, విభ‌జిత ఏపీ సీఎంగా చంద్ర‌బాబు నాయుడు సింగ‌పూర్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు 58 సార్లు సింగ‌పూర్ వెళ్లారు. టూర్‌కు ముందు ప్ర‌తిసారీ రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకురావ‌డానికే వెళ్తున్న‌ట్లుగా ప్ర‌క‌టిస్తారు. గ‌త 57 సార్లు రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబ‌డి కూడా సింగ‌పూర్ నుంచి సాధించ‌లేక‌పోయిన బాబు.. ఈ ద‌ఫా అయినా శుభ‌వార్త చెబుతారా..? లేక ఎప్ప‌టిలాగే ఈ సారి కూడా సారీ చెబుతారా..? అని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు.

సింగపూర్ పర్యటనలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బృందం బిజీబిజీగా గ‌డుపుతోంది. నాలుగో రోజు సీఎం చంద్రబాబు నాయుడు వరుసగా పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్, మందాయ్ వైల్డ్‌లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC), టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీలు నిర్వహించారు. చంద్ర‌బాబు బృందం సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న ఫొటోల‌ను టీడీపీ సోష‌ల్ మీడియా లైవ్ అప్డేట్ చేస్తోంది. ఆ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ టీడీపీ శ్రేణులు ప్ర‌చారం ముమ్మ‌రం చేశాయి. అయితే గ‌త సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌ అనుభ‌వాలు చంద్ర‌బాబు ప్ర‌తిష్ట‌కు స‌వాల్‌గా మారింది. ఈసారి సీఎం బృందం ఎన్ని కోట్ల పెట్టుబ‌డులు ఆక‌ర్షిస్తుంద‌నేది ప్ర‌శ్న‌.

ఏపీకి సింగ‌పూర్ ప్ర‌భుత్వం షాక్‌
చంద్రబాబుకు సింగపూర్ ప్రభుత్వం షాకిస్తూ ఆ దేశానికి చెందిన మంత్రి సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అమరావతి నిర్మాణంలో భాగస్వామి కాలేమని స్పష్టం చేసిన సింగపూర్ మంత్రి టాన్సీ లెంగ్ ప్రకటించారు. అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో పాల్గొమని స్పష్టంగా ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. సింగపూర్ కన్సార్టియం ఇక ఉండదని ప్రకటించారు. పట్టణాభివృద్ధి ప్రణాళికలు సాంకేతిక సహాయం మాత్రమే అందిస్తామని వెల్ల‌డించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సీడ్ క్యాపిటల్ కోసం సెంబ్ కార్బ్, సింగ్ బ్రిడ్జి కన్సార్షియం ఏర్పాటు చేశారు. గ‌తంలో మంత్రి ఈశ్వ‌రన్‌ను అవినీతి కేసుల్లో సింగపూర్ ప్రభుత్వం జైలుకు పంపించింది.

గ‌త 57 ప‌ర్య‌ట‌న‌ల్లోనూ సింగ‌పూర్ నుంచి ఒక్క రూపాయి పెట్టుబ‌డి కూడా ఏపీకి సాధించిన దాఖ‌లాలు లేవ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. మీడియా మేనేజ్‌మెంట్ కోసం సింగ‌పూర్‌లోని ప‌లు సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో ఫొటోలు దిగుతుంటార‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఇప్పుడైనా (58వ సారి) సింగ‌పూర్ నుంచి పెట్టుబ‌డులు సాధిస్తారా..? అని ప్ర‌తిప‌క్ష వైసీపీ ప్ర‌శ్నిస్తోంది. సింగ‌పూర్ ఇత‌ర ప్రాంతాల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డం చాలా అరుదు అని వాద‌న కూడా వినిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment