వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. జనసేన కార్యకర్తల ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీస్ స్టేషన్‌లో దువ్వాడపై కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో టెక్కలి పోలీసులు 41ఏ నోటీసులు దువ్వాడకు అందజేశారు.
ఫిర్యాదేంటంటే..
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట. ముఖ్యంగా, పవన్‌ను ఉద్దేశించి చెప్పు చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ అంశంపై జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు పంపారు.
కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్ష వైసీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియా యాక్టివిస్టులను సైతం అరెస్టులు చేస్తున్నారు. తాజాగా నాయకులపై కేసులు నమోదవుతున్నాయి.
జనసేన ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ మంగళగిరిలోని కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టిన పవన్ అప్పుడు అధికారంలో ఉన్న నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పు చూపించారు. తాట తీస్తా, తోలు వొలిచేస్తానని బహిరంగంగానే వార్నింగ్‌లు ఇచ్చారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీను చెప్పు చూపించినందుకే జనసేన ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది.