నేను కొడితే మామూలుగా ఉండద అంటూ పొలిటికల్ కామెంట్స్‌తో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు మీడియాలో కనిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్.. తన ఫామ్ హౌస్‌లోనే రాష్ట్ర స్థితిగతులు, పార్టీ నిర్మాణం వంటి అంశాలను కీలక నేతలతో సమావేశాలు నిర్వహించుకుంటూ ఉన్న కేసీఆర్.. రీ ఎంట్రీకి అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనపై, తెలంగాణ రాష్ట్ర పరిస్థితిపై కీలక కామెంట్లు చేశారు. `ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్నా.. గంభీరంగా చూస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాలనూ ముంచింది. రాబోయే రోజుల్లో మనదే విజయం. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలి.
నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే బీఆర్ఎస్‌కే ఎక్కువ ఓటింగ్ వచ్చింది. నేను చెప్పినా ప్రజలు వినలేదు. అత్యాశకు పోయి కాంగ్రెస్‌కు ఓటువేశారు.రైతు బంధుకి రాం రాం, దళిత బంధుకి జై భీం చెబుతారని ఆనాడే చెప్పాను. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కి ఓటేశారు. కాంగ్రెస్ అన్ని వర్గాలనూ ముంచింది. ప్రత్యక్ష పోరాటానికి సిద్ధంకండి. ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభపెడతాం. మీరంతా తరలిరావాలి` అని కేసీఆర్ పిలుపునిచ్చారు.