మరోసారి విజృంభిస్తున్న బర్డ్‌ఫ్లూ

మరోసారి విజృంభిస్తున్న బర్డ్‌ఫ్లూ

Summarize with AI

తెలుగు రాష్ట్రాల్లో నెల రోజుల క్రితం కలకలం సృష్టించిన బర్డ్‌ఫ్లూ (Bird Flu) మరోసారి విజృంభిస్తోంది. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో గుండ్రాంపల్లి, దోతి గూడెం పరిసరాల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమై ఈ ప్రాంతాలను రెడ్‌జోన్ (Red Zone)గా ప్రకటించారు. వైరస్‌ మరింత విస్తరించకుండా నివారించేందుకు అధికారులు దాదాపు 2 లక్షల కోళ్లను తొలగిస్తున్నారు. అంతేకాక, బయో-సెప్టిక్‌ చర్యలు (Bio-septic Measures) చేపట్టారు.

చికెన్ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం
ఇటీవ‌ల బర్డ్‌ఫ్లూ కారణంగా ప్రజలు చికెన్, గుడ్లు తినడమే మానేయగా, చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. వ్యాపార నష్టం భరించలేక పలుచోట్ల ఉచితంగా చికెన్ వంటకాలు పంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి రావచ్చన్న భయంతో కోళ్ల ఫామ్ యాజమానులు, వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment