బిలావల్ భుట్టో పెళ్లి వార్తలు.. సోషల్ మీడియాలో వైరల్

బిలావల్ భుట్టో పెళ్లి వార్తలు.. సోషల్ మీడియాలో వైరల్

Summarize with AI

పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP) చైర్మన్‌, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ (Bilawal Bhutto Zardari) త్వరలో యూరప్‌కు (Europe) చెందిన రాజకుటుంబ సభ్యురాలిని(Royal FamilyMember)వివాహం(Marriage) చేసుకోబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను పీపీపీ నేత, కరాచీ మేయర్‌ ముర్తజా వహాబ్‌ (Murtaza Wahab) ఖండించారు. బిలావల్‌ నిశ్చితార్థం, వివాహానికి సంబంధించిన వార్తలు తప్పుడు, నిరాధారమైనవని స్పష్టం చేశారు.

బిలావల్‌ భుట్టో జర్దారీ(Bilawal Bhutto Zardari) వయసు 38 సంవత్సరాలు. ఆయన పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ కుమారుడు. ఆసిఫ్‌ అలీ జర్దారీ (Asif Ali Zardari) తన కుమారుడి వివాహం గురించి చర్చించేందుకు యూరప్‌లోని లిక్టెన్‌స్టెయిన్‌కు(Liechtenstein) వెళ్లినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాకుండా 26 ఏళ్ల మాజీ ఆస్ట్రియన్‌ ఆర్చ్‌డచెస్‌ గ్లోరియా వాన్‌ హ్యాబ్స్‌బర్గ్‌ను(Gloria von Habsburg) బిలావల్‌ వివాహం చేసుకోబోతున్నారంటూ కొన్ని కథనాలు పేర్కొన్నాయి.

అయితే బిలావల్‌తో గ్లోరియా వాన్‌ హ్యాబ్స్‌బర్గ్‌ వివాహం జరగబోతోందనే వార్తలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. ఈ ప్రచారంపై ముర్తజా వహాబ్‌(Murtaza Wahab) ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ.. బిలావల్‌ నిశ్చితార్థం, వివాహానికి సంబంధించిన వార్తలు పూర్తిగా తప్పుడు, ఆధారరహితమైనవని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్‌కు చెందిన ‘డైలీ ఔసాఫ్‌’(Daily Ausaf) కూడా వివాహ ఏర్పాట్లపై కథనం ప్రచురించి, అనంతరం దాన్ని తొలగించింది.

మరోవైపు ఆసిఫ్‌ అలీ జర్దారీ యూరప్‌ పర్యటనపై పాకిస్థాన్‌ అధ్యక్ష భవన్‌ (President House of Pakistan) ఆగస్టు 27న స్పందించింది. ఆయన ప్రైవేట్‌ పర్యటన కోసం విదేశాలకు వెళ్లినట్లు మాత్రమే వెల్లడించింది. పర్యటన ఉద్దేశాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇప్పటివరకు బిలావల్‌ భుట్టో లేదా ఆయన కుటుంబ సభ్యులు వివాహ ప్రచారంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వార్తలకు అధికారిక ఆధారాలు లేవని స్పష్టమవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment