టీడీపీకి బిగ్ షాక్‌.. జీవీ రెడ్డి రాజీనామా

Big shock for TDP.. GV Reddy's resignation from Telugu Desam Party

Summarize with AI

తెలుగుదేశం పార్టీకి జీవీ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీ స‌భ్య‌త్వానికి, ఏపీ ఫైబ‌ర్ నెట్ చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నట్లుగా జీవీ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాన‌ని లేఖ‌లో పేర్కొన్నారు. ఈ మేర‌కు రాజీనామా లేఖను టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు జీవి రెడ్డి ప్రకటించారు. ఇక నుంచి పూర్తిగా న్యాయవాది వృత్తిలో కొనసాగుతానని వెల్లడించారు.

టీడీపీ క్రియాశీల‌క నేతగా, అధికార ప్ర‌తినిధిగా త‌న గొంతు వినిపించే జీవీ రెడ్డి ఇటీవ‌ల ఏపీ ఫైబ‌ర్ నెట్ చైర్మ‌న్‌గా నియ‌మితుల‌య్యారు. కాగా, ఫైబ‌ర్ నెట్‌లో కొంద‌రు అధికారులు త‌న మాట విన‌డం లేదని, కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక ఫైబ‌ర్ నెట్‌కు ఒక్క పైసా ఆదాయం రాలేద‌ని, ఒక్క కొత్త క‌నెక్ష‌న్ కూడా ఎవ‌రూ తీసుకోలేద‌ని ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment