తిరుపతి (Tirupati) నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గోశాల (Gosala) లో గోవుల మృతి (Death of Cows) వ్యవహారంపై రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ అంశంపై చర్చించేందుకు గోశాలకు రావాలని తెలుగుదేశం పార్టీ (TDP) వైసీపీ మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి (Bhumana Karunakara Reddy) కి సవాల్ విసిరింది. టీడీపీ (TDP) ఛాలెంజ్‌ను భూమన స్వీకరించారు. చనిపోయిన గోవులు గోశాలలో ఉండవనే కనీస జ్ఞానం లేదా అని ఎద్దేవా చేస్తూనే.. భూమన ఈ సవాల్ (Challenge) ను స్వీకరించి, ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానని ప్రకటించారు.
టీడీపీ-వైసీపీ (TDP–YSRCP) ఛాలెంజ్ వార్‌తో బుధవారం అర్ధరాత్రి నుంచే తిరపతిలో హైటెన్షన్ (High Tension) నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశాన్ని ముందుగానే గుర్తించిన పోలీసులు ఛాలెంజ్ స్వీకరించిన భూమనతో పాటు తిరుపతిలోని వైసీపీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలను హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. పోలీసులు సైతం ఏకపక్షంగా వైసీపీ నేతలను మాత్రమే హౌస్ అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. ప్రస్తుతం ఈ పరిణామం తిరుపతిలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
మరో వైపు తెలుగుదేశం (TDP) పార్టీ కూడా గోశాలకు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమైంది. తెలుగుదేశం, జనసేన (JanaSena) పార్టీల నేతలు వాట్సాప్ గ్రూప్‌లలో ఉదయాన్నే గోశాలకు క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలని సందేశాన్ని పంపగా, అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.