తనపై నమోదైన కేసులపై టీటీడీ (TTD) మాజీ చైర్మన్ (Former Chairman), వైసీపీ (YSRCP) నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ఘాటుగా స్పందించారు. ‘‘ఒక్క కేసు (Case) కాదు.. ఇలాంటివి మరో వంద కేసులు పెట్టినా నేనేం భయపడను (Not Afraid). న్యాయం (Justice) మా వైపే ఉంది. తప్పుడు కేసులతో నా ధర్మాన్ని దిగజార్చలేరు’’ అంటూ తన స్టాండ్‌ను ప్రకటించారు. తన మీద వ్యక్తిగత దాడులు చేస్తే, తనను ప్రశ్నించకుండా చేస్తే తాము భయపడతాం అనుకోవడం వైరిపక్షం అపోహ అని, ప్రజాస్వామ్యంలో అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించడమే తన హక్కు అన్నారు. అధికార పార్టీ తప్పుల్ని ఎత్తిచూపడాన్ని మానుకోనని భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.
అలాగే, ‘‘విద్యార్థి దశ నుంచి నేను పోరాటాల మధ్యే పెరిగాను. ఏ అన్యాయమైనా జరిగినా నేను ప్రశ్నించక తప్పదని భావించే వాడిని. దేవుడ్ని అడ్డుపెట్టి అధికారంలోకి వచ్చిన మీరు, టీటీడీ పరువు దిగజార్చేలా చేస్తున్నారని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు’’ అని భూమన విమర్శలు గుప్పించారు.
గోశాలలో ఆవుల మృతి.. కేసుల వివాదం
గోశాలలో (Gosala) ఆవుల మృతి (Cows Deaths)పై తప్పుడు ఆరోపణలు చేశారంటూ భూమన కరుణాకర్ రెడ్డి పై ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌లో కేసు (Case) నమోదైంది. టీటీడీ (TTD) బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి (Bhanuprakash Reddy) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద భూమనపై కేసు నమోదు చేశారు. గోశాలలో గోవుల మృతిపై అసత్య ఆరోపణలు చేశారని, ఈ వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఈ కేసులకు తాను భయపడే ప్రసక్తే లేదంటూ, రాజకీయ కక్షతోే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెడుతున్నారని భూమన కౌంటర్ ఇచ్చారు.
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య