---Advertisement---

”ఏమండోయ్ నాని గారూ.. చెప్పండోయ్ చిన్ని గారూ”

''ఏమండోయ్ నాని గారూ.. చెప్పండోయ్ చిన్ని గారూ''
---Advertisement---

కేశినేని బ్ర‌ద‌ర్స్ (Keshineni Brothers) మ‌ధ్య చిల్డ్ వాట‌ర్ బాటిల్ పెట్టినా సెక‌న్ గ్యాప్‌లో హీట్ అయ్యేలా త‌యారైంది వాతావ‌ర‌ణం. బెజ‌వాడ బ్ర‌ద‌ర్స్ (Bejawada Brothers) ర‌గ‌డ‌ స‌వాళ్లు దాటి.. లీగ‌ల్ నోటీసుల (Legal Notices) వ‌ర‌కు చేరింది. ”ఏమండోయ్ నాని గారూ నా మీద చేసిన ఆరోప‌ణ‌లు రుజువు చేయండి అంటూ కేశినేని చిన్న(Keshineni Chinni) రూ.100 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా నోటీసులు పంపిస్తే.. నేను చేసిన ప్ర‌తి మాట‌కు కట్టుబ‌డి ఉన్నాను చిన్ని గారూ” అంటూ జ‌వాబిచ్చారు.

అస‌లేంటి గొడ‌వ‌..?
కొత్త‌గా స్థాపించిన ఉర్సా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (URSA Private Limited) కి విశాఖ‌ప‌ట్నం (Visakhapatnam) లోని విలువైన ప్రాంతంలో 60 ఎకరాల భూమిని ప్ర‌భుత్వం కేటాయించింది. రూ.10 ల‌క్ష‌ల మూల‌ధ‌నంతో ఏర్పాటైన ఈ సంస్థ రూ.5,728 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నుందా..? అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) కేశినేని నాని (Keshineni Nani) రాసిన బ‌హిరంగ లేఖ (Open Letter) రాశారు. అందులో త‌న త‌మ్ముడు కేశినేని శివ‌నాథ్ (చిన్నీ) పేరును ప్ర‌స్తావించారు. ఉర్సా కంపెనీలో డైరెక్టర్లలో ఒకరు అబ్బూరి సతీష్ (Abboori Satish), టీడీపీ ఎంపీ కేశినేని చిన్నీకి స‌న్నిహితుడు. గతంలో వీరిద్దరూ 21 సెంచ‌రీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ (21st Century Investments & Properties Pvt. Ltd) అనే కంపెనీని కలిసి నడిపారు అని, ఆ కంపెనీ ద్వారా కోట్లు వసూలు చేసి, ఆపై మూసివేసి చాలా మంది పెట్టుబడిదారులను మోసం చేశారని కేశినేని నాని పేర్కొన్నారు.

ఉర్సా కంపెనీకి విశాఖ‌లో భూమి కేటాయింపు వెనుక వ్య‌క్తి కేశినేని శివనాథే అని, ఆయనే తన ప్రాబల్యాన్ని ఉపయోగించి ఉర్సా క్లస్టర్స్ పేరుతో ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. కేశినేని శివనాథ్ అనే ఎంపీకి బందరు, విజయవాడ పరిధిలో ఫ్లై యాష్, బూకియాడి, మైనింగ్, గ్యాంబ్లింగ్ మరియు రియల్ ఎస్టేట్ మాఫియాలలో తీవ్ర సంబంధాలు ఉన్నాయని ప్రజల్లో ప్రచారం అవుతోందని, ముఖ్యంగా నారా లోకేష్‌ (Nara Lokesh) పేరు చెప్పుతూ ప్రభుత్వపేరు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయని చంద్ర‌బాబుకు సూచిస్తూ కేశినేని నాని ట్వీట్ చేశారు. ఆ త‌రువాత కేశినేని చిన్నీ నుంచి స్పంద‌న రావ‌డంతో ఆధారాల‌ను మెన్ష‌న్ చేస్తూ కంప్యూట‌రైజ్డ్ ఎవిడెన్స్ స్క్రీన్‌షాట్స్ (Computerized Evidence Screenshots) ప్ర‌ద‌ర్శిస్తూ మ‌రో ట్వీట్ (Tweet) చేశారు నాని.

త‌మ్ముడిపై అన్న కేశినేని నాని చేసిన ట్వీట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇటీవ‌ల ఎంపీ చిన్నీ మంత్రి లోకేశ్‌తో అత్యంత స‌న్నిహితంగా మెలుగుతుండ‌డంతో నాని చేసిన ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూర్చినంత ప‌నైంద‌ని, ఆధారాలు కూడా అంతే బ‌లంగా ఉన్నాయ‌ని, ఉర్సా వెనుక చిన్నీ పాత్ర నిజ‌మేన‌న్న వాద‌న‌ సొంత పార్టీలో ఊపందుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంద‌ట‌. దీంతో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నీఅప్ర‌మ‌త్త‌మ‌య్యారు. కేశినేని నానిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన ఎంపీ కేశినేని చిన్నీ.. లీగ‌ల్ నోటీసులు పంపించారు.

చిన్నీ నోటీసుల‌కు నాని స్పంద‌న‌..
చిన్ని పంపించిన లీగల్ నోటీసుపై సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు కేశినేని నాని. రూ.100 కోట్లు కాదు రూ.లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారి పై నా పోరాటం ఆగదు అంటూ అన్న కేశినేని నాని తీవ్రంగా స్పందించారు. సీఎం చంద్ర‌బాబుకు ఎక్స్ వేదిక‌గా రాసిన లేఖలోని ప్రతీ మాటకు తాను కట్టుబడి ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌నకు పంపించింది కేవలం లీగల్ నోటీసు కాదు.. విమర్శలను బెదిరించడానికి, మౌనంగా ఉంచడానికి, నోరు మూయించడానికి చేస్తున్న ప్రయత్నం అని ఘాటుగా స్పందించారు. కానీ, తాను మౌనంగా ఉండ‌న‌ని కౌంట‌ర్ ఇచ్చారు.

భూ లావాదేవీలు, పేర్ల దుర్వినియోగం, అక్రమాలపై ఆరోపణలు, ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాధానాలు ఆశిస్తాం కానీ, బెదిరింపులు కాదంటూ చిన్నీపై తీవ్రంగా స్పందించారు కేశినేని నాని. తాను భయంతో కాదు.. వాస్తవాలతో స్పందిస్తానని, దేనికీ రాజీప‌డే ప్ర‌స‌క్తే లేదంటూ బ‌దులిచ్చారు. సత్యం బెదిరింపులకు భయపడదు.. తాను కూడా భయపడను అంటూ వ్యాఖ్యానించారు. కాగా, కేశినేని నాని – కేశినేని చిన్నీ వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బెజ‌వాడ బ్ర‌ద‌ర్స్ ర‌గ‌డ ఎప్పుడు ఏ మ‌లుపు తిరుగుతుందో.. ఈ వివాదం ఎలా ముగియ‌నుందో వేచిచూడాలంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment