హైదరాబాద్‌లో బీరప్ప ఆలయం ధ్వంసం, విగ్రహాల చోరీ

హైదరాబాద్‌లో బీరప్ప ఆలయం ధ్వంసం, విగ్రహాల చోరీ

Summarize with AI

హైదరాబాద్‌లో ఆలయాలపై దాడులు కొనసాగుతుండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఉన్న బీరప్ప ఆలయాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి, విగ్రహాలను అపహరించారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.

కురుమ సంఘం ఆగ్రహం
ఈ ఘటనపై కురుమ సంఘం నాయకులు తీవ్రంగా స్పందించారు. పవిత్రమైన బీరప్ప ఆలయాన్ని ధ్వంసం చేయడం దారుణం అని, ఇది కురుమల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని ఎంతో విశ్వాసంతో పూజించే విషయాన్ని గుర్తుచేశారు. ఆల‌యాన్ని ధ్వంసం చేసి విగ్ర‌హాల‌ను అప‌హ‌రించిన దోషులను వెంట‌నే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment