హైదరాబాద్‌లో ఆలయాలపై దాడులు కొనసాగుతుండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఉన్న బీరప్ప ఆలయాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి, విగ్రహాలను అపహరించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కురుమ సంఘం ఆగ్రహం
ఈ ఘటనపై కురుమ సంఘం నాయకులు తీవ్రంగా స్పందించారు. పవిత్రమైన బీరప్ప ఆలయాన్ని ధ్వంసం చేయడం దారుణం అని, ఇది కురుమల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని ఎంతో విశ్వాసంతో పూజించే విషయాన్ని గుర్తుచేశారు. ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాలను అపహరించిన దోషులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.