బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం.. తుఫానుగా మార‌నుందా?

బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం.. తుఫానుగా మార‌నుందా?

ఆగ్నేయ బంగాళాఖాతం (Southeast Bay of Bengal)లో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతోంది. ఇది ఇవాళ మరింత బలపడి తీవ్ర వాయుగుండం (Deep Depression)గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.

IMD అంచనాల ప్రకారం.. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గాలులు బలంగా వీచే సూచనలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ తీవ్ర వాయుగుండం రానున్న రోజుల్లో తుఫాను (Cyclone)గా మారే అవకాశం కూడా ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, అవసరమైతే మరిన్ని హెచ్చరికలు జారీ చేస్తామని IMD స్పష్టం చేసింది.

వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా మారే అవకాశముండటంతో పోర్టులకు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టులకు ఒకటో నంబర్ తుఫాను హెచ్చరికను అధికారులు ప్రకటించారు.

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని సూచించారు. అలాగే తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, వాతావరణ శాఖ ఇచ్చే సూచనలను అనుసరించాలని అధికారులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment