అర్నబ్(Arnab), మురసు (Murusu) తుపానులతో (Cyclones) ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ ప్రజలకు మరో పిడుగులాంటి వార్త. ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) మరో తుఫాన్ (Cyclone) ముప్పు పొంచి ఉందనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి, రానున్న 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో(Southeast Bay of Bengal) వాయుగుండంగా(Depression) మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. నవంబర్ 16 నాటికి ఇది తుఫాన్‌గా మారవచ్చని, ఉత్తర కోస్తాంధ్ర వైపు పయనించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
‘అక్వాన్'(Akwan) పేరుతో ప్రస్తావిస్తున్న ఈ తుఫాన్ సముద్రంపైనే తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు. నవంబర్ 15 నుంచి ఈదురుగాలుల తీవ్రత పెరుగుతుందని, తుఫాన్ ప్రభావంతో గంటకు 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు (Winds) వీచే ప్రమాదం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.
గతంలో సంభవించిన అర్నబ్ తుఫాన్ తరహాలోనే దీని ప్రభావం ఉండవచ్చనే ప్రచారం నేపథ్యంలో కోస్తాంధ్ర (Coastal Andhra) ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే తుఫాన్ ఏర్పడే అవకాశం, దాని తీవ్రత, ప్రయాణ దిశ, తీరం దాటే ప్రాంతంపై భారత వాతావరణ శాఖ అధికారిక అంచనాలే కీలకం.








