భారత్‌కు కొత్త టెన్షన్.. అక్షర్ పటేల్ గాయం

భారత్‌కు కొత్త టెన్షన్.. అక్షర్ పటేల్ గాయం

ఆసియా కప్ (Asia Cup)-2025 టోర్నమెంట్‌ (Tournamentలో పాకిస్తాన్‌ (Pakistan)తో జరగబోయే ముఖ్యమైన మ్యాచ్‌కి ముందు భారత జట్టు (India Team)కు ఒక సమస్య ఎదురైంది. ఒమన్‌ (Oman)తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) గాయపడ్డాడు. క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో కిందపడినప్పుడు అతని తల మైదానానికి బలంగా తగిలింది. వెంటనే ఫిజియో వచ్చి అతనిని పరీక్షించి, మైదానం నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్షర్ మళ్ళీ ఫీల్డింగ్‌కు రాలేదు.

భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ (Fielding Coach) టి.దిలీప్ (T. Dilip) మాట్లాడుతూ అక్షర్ పటేల్ బాగానే ఉన్నాడని చెప్పినా, అతని గాయం ఎంత తీవ్రంగా ఉందనే దానిపై పూర్తి స్పష్టత ఇవ్వలేదు. దీనితో, పాకిస్తాన్‌తో జరిగే సూపర్‌-4 మ్యాచ్‌కి అతను అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందేహం నెలకొంది. ఈ టోర్నమెంట్‌లో అక్షర్ ఇప్పటివరకు రెండు వికెట్లు తీసి, 26 పరుగులు చేశాడు. భారత్ లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment