ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగదా?

ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగదా?

సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar)  ఈరోజు (ఆగస్టు 19) ప్రకటించనున్నారు. ఈ టోర్నీలో టీమిండియా తమ మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.

భారత్-పాక్ మ్యాచ్‌పై సందేహాలు

అయితే, ఇటీవల పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ కారణంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ను భారత్ బహిష్కరించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ ఈ మ్యాచ్ జరగదని గట్టిగా చెప్పారు.

“ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదు. టీమిండియా ఆడదనే నమ్మకం నాకు ఉంది. పాకిస్తాన్‌తో ఎక్కడ ఆడినా భారత్‌దే విజయం అవుతుంది. ఈ విషయం పాకిస్తాన్ జట్టుకు కూడా తెలుసు. అయినప్పటికీ ఈ మ్యాచ్ జరగకూడదు” అని జాదవ్ ఏఎన్‌ఐతో అన్నారు.

గతంలో దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలోనూ పాకిస్తాన్‌తో ఆడేందుకు ఇండియా ఛాంపియన్స్ నిరాకరించింది. ఆ లీగ్‌లో ఒక లీగ్ మ్యాచ్‌తో పాటు సెమీ ఫైనల్‌ను కూడా యువీ సారథ్యంలోని భారత జట్టు బహిష్కరించింది.

మ్యాచ్ జరిగే అవకాశాలే ఎక్కువ

డబ్ల్యూసీఎల్ ఒక ప్రైవేట్ లీగ్ కావడం వల్ల భారత్ ఆ మ్యాచ్‌లను బహిష్కరించగలిగింది. కానీ ఆసియా కప్ టోర్నీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి, పాకిస్తాన్‌తో భారత్ ఖచ్చితంగా తలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ టీమిండియా పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే, బ్రాడ్‌కాస్టర్లకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment