పాక్‌పై ఘన విజయం.. సైన్యానికి అంకితం – సూర్య ఎమోష‌న‌ల్‌ (Video)

పాక్‌పై ఘన విజయం.. సైన్యానికి అంకితం - సూర్య ఎమోష‌న‌ల్‌

ఆసియా కప్‌–2025లో పాకిస్తాన్‌పై టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించి సూపర్‌–4లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో జట్టు ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.

మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ విజయాన్ని భారత సైన్యానికి అంకితం చేశాడు. అలాగే, తన పుట్టినరోజు సందర్భంలో అభిమానులకు ఈ విజయం ఒక ప్రత్యేక కానుకగా నిలిచిందని సూర్య భావోద్వేగంతో అన్నాడు.

“స్టేడియంలో అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన క్షణం మరపురానిది. ఈ విజయం వారికి రిటర్న్‌ గిఫ్ట్‌లాంటిది. పాక్‌పై ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టాం. ప్రతి జట్టును ఎదుర్కొనేలా ముందుగానే ప్రణాళిక వేసుకున్నాం. ఇక్కడి పిచ్‌ల స్వభావం నాకు బాగా తెలుసు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో స్పిన్నర్ల పాత్ర మ్యాచ్‌ను మలుపుతిప్పగలదని ఎప్పుడూ నమ్ముతాను’’ అని సూర్య వివరించాడు.

అదే విధంగా పహల్గామ్‌ ఉగ్రదాడి బాధితులను గుర్తుచేసుకున్న సూర్య, “వారి కోసం మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాం. ఉగ్రవాదులను ఎదుర్కొనే ధైర్యసాహసాలు చూపిన మన సైనికులకే ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. వారు దేశానికి గర్వకారణంగా నిలుస్తారు. వారి ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడం కోసం మేము మైదానంలో ఏ అవకాశం వదులుకోం’’ అంటూ భావోద్వేగంతో స్పందించాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment