ఏపీలో పదవులు.. తెలంగాణలో నివాసాలు.. నెట్టింట ర‌చ్చ‌!

ఏపీలో పదవులు.. తెలంగాణలో నివాసాలు.. నెట్టింట ర‌చ్చ‌!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నివాసాల చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) హైదరాబాద్ (Hyderabad) పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు (Chandrababu) నివాసానికి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలవడమే ఈ చర్చకు ప్రధాన కారణమైంది.

ఏపీలో (AP) ముఖ్య‌మంత్రి(Chief Minister), ఉప ముఖ్య‌మంత్రి (Deputy Chief Minister) ప‌ద‌వులు అనుభ‌విస్తున్న కూట‌మి పెద్ద‌లు స్వ‌రాష్ట్రంలో కాకుండా, ప‌క్క రాష్ట్రంలో ఉండ‌డం, అక్క‌డే వారి ఇళ్ల‌లో ప్ర‌ధానిని క‌ల‌వ‌డంపై నెటిజ‌న్లు ప్ర‌శ్న‌లు కురిపిస్తున్నారు. ఏపీ విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా, రాష్ట్రానికి కీలకమైన ఇద్దరు నేతలు ఇంకా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనే తమ స్థిర నివాసాలను కొనసాగించడంపై నెటిజన్లు, ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

“పదవులు అనుభవించేది ఏపీలో.. స్థిరంగా ఉండేది మాత్రం తెలంగాణలోనా(Telangana)?” అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి వీకెండ్ రాగానే ఏపీ పాలకులు తమ మకాంను హైదరాబాద్‌కు మారుస్తున్నారని, ఇది రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సొంత పార్టీ శ్రేణుల్లోనూ అసహనం..
అధికార పార్టీలైన టీడీపీ(TDP), జనసేన(Janasena) శ్రేణులు ఈ విమర్శలకు గట్టిగా బదులివ్వలేకపోతున్నాయి. కొందరు సొంత పార్టీ కార్యకర్తలు సైతం లోలోన అసహనం వ్యక్తం చేస్తున్నారు. “ఏపీలో ఇల్లు కట్టుకోవడానికి పదేళ్లు దాటినా సమయం దొరకలేదా? ప్రజల మధ్యే ఉంటామని చెప్పే నేతలు, రాత్రికి పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోవడం ఏంటి?” అని సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు.

కుప్పం, అమరావతిలో..
చంద్రబాబు నాయుడు 37 ఏళ్లుగా కుప్పం(Kuppam) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా, అక్కడ సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ఇన్నేళ్లు పట్టిందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇటీవలే కుప్పంలో ఇల్లు కట్టుకున్న ఆయన, ప్రస్తుతం అమరావతిలో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఇదేనని, ఆయనకు కూడా ఏపీలో సరైన స్థిర నివాసం లేకపోవడం దారుణమని విమర్శిస్తున్నారు.

“స్వరాష్ట్రంలో కనీసం ఉండటానికి ఇల్లు లేని వారు, రాష్ట్ర అభివృద్ధి గురించి సూక్తులు చెప్పడం ఏంటి?” అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్తున్న నేతలు, కనీసం నివాసం విషయంలోనైనా ఏపీకి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తారో చూడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోడీ పర్యటన ఈ ఇద్దరు నేతలకు వ్యక్తిగతంగా ఊర‌ట‌నిచ్చినా, అది కాస్తా రాజకీయంగా వారికి సెల్ఫ్ గోల్‌గా మారిందనే చర్చ నడుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment