ఇరుక్కున్న హోంమంత్రి!.. సోష‌ల్ మీడియాలో రచ్చ‌

ఇరుక్కున్న హోంమంత్రి!.. సోష‌ల్ మీడియాలో రచ్చ‌

ఏపీ హోంమంత్రి (AP HomeMinister) అసెంబ్లీ (Assembly) వేదిక‌గా మాట్లాడిన వ్యాఖ్య‌లు రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను వివాదానికి దారితీశాయి. డ‌బ్బుల కోసం కులాల మార్చుకుంటున్నార‌ని గౌర‌వ చ‌ట్టస‌భ‌లో చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. హోంమంత్రి వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా సెటైర్లు పేలుతున్నాయి. రాష్ట్రంలో రోజుకో చోట మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు, బోలెడ‌న్ని లా అండ్ ఆర్డ‌ర్ (Law And Order) స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ వాటిపై దృష్టిపెట్ట‌కుండా, అసెంబ్లీ (Assembly)లో కులాల (Castes) ప్ర‌స్తావ‌న చేస్తూ అబ‌ద్ధాలు వ‌ల్లెవేశార‌ని హోంమంత్రిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

వైసీపీ, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కులాల మ‌ధ్య చిచ్చుపెడుతున్నార‌ని, సోష‌ల్ మీడియాలో పోస్టుల‌కు డ‌బ్బులిస్తున్నార‌ని అసెంబ్లీలో ఆరోపించిన హోంమంత్రి, యాక్టివిస్ట్‌ల పేర్లు, వారి కులాల గురించి ప్ర‌స్తావిస్తూ, చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. చ‌ల‌ప‌తి చౌద‌రి అనే యాక్టివిస్ట్ చౌద‌రి కాదు.. రెడ్డీ అని, ఆంధ్ర పాడ్ కాస్ట‌ర్‌ యూట్యూబ్ ఛాన‌ల్ వ్య‌క్తి పేరు చివ‌ర రెడ్డి అని పెట్టుకోక‌పోవ‌డాన్ని కూడా ఒక కార‌ణంగా చూపిస్తూ ఆమె వ్యాఖ్యానించ‌డంపై చ‌ల‌ప‌తి, విజ‌య్ కేస‌రి తీవ్రంగా స్పందించారు. హోంమంత్రి చేసిన సోష‌ల్ మీడియా వేదిక‌గా వారిపై చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించారు.

ఇంటెలిజెన్స్‌, పోలీస్ వ్య‌వ‌స్థ మొత్తం హోంమంత్రి గుప్పిట్లోనే ఉంటాయి. ఏదైనా ఒక విష‌యం గురించి నిర్ధార‌ణ చేసుకోవాలంటే ఆవిడ‌కు చాలా సుల‌భం. వాస్త‌వాల‌ను ప‌రిశీలించుకోకుండా, చ‌ట్ట స‌భ వేదిక‌గా చ‌దువుకున్న యువ‌కులు, వారి కులాల గురించి త‌ప్పుగా ప్ర‌చారం చేయ‌డంతో హోంమంత్రి వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా కౌంట‌ర్లు ప‌డుతున్నాయి. స‌భ‌లో మాట్లాడే ముందు వెరిఫై చేసుకుంటే బాగుండేద‌ని, కులాలకు అతీతంగా అన్యాయాలను ప్రశ్నించే వారిని, అభిమానంతో వైసీపీకి మ‌ద్ద‌తిచ్చే వారిని కూడా కులాల వారీగా విభ‌జించి చూడ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి వారే అభిమానులుగా ఉండాలా..? అనే ప్ర‌శ్న‌లు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. అసెంబ్లీలో ఆధారాలు లేకుండా చేసిన వ్యాఖ్య‌ల‌తో హోంమంత్రి అనిత అడ్డంగా ఇరుక్కున్నార‌నే చ‌ర్చ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తోంది.

చ‌ల‌ప‌తి చౌద‌రి రియాక్ష‌న్‌
“దేవాలయం లాంటి శాసనసభలో హోంమంత్రి మాట్లాడుతూ, నా సోష‌ల్ మీడియా ఐడీ (చలపతి చౌదరి) చూపిస్తూ, నేను చౌదరి కాదు.. రెడ్డి అని ప్రస్తావించారు. నేను రెడ్డి సామాజికవర్గానికి చెందినవాడిని అని సభలో పేర్కొనడం పూర్తిగా అసత్యం..అవాస్తవం!! ఈ కులప్రస్తావనలో గౌరవ స్పీకర్ ఖండిచక పోగా నవ్వుతూ సమర్ధించటం ఇంకో విచారకరమైన సంఘటన. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి వైసీపీకి మ‌ద్ద‌తు ఇస్తే త‌ప్పా..? అని హోంమంత్రిని ప్ర‌శ్నించాడు.

లాజిక్‌తో కొట్టిన ఆంధ్ర‌పాడ్‌కాస్ట‌ర్‌
అసెంబ్లీలో హోంమంత్రి వ్యాఖ్య‌ల‌పై ఆంధ్ర పాడ్ కాస్ట‌ర్ విజ‌య్ కేస‌రి స్పందిస్తూ.. “నా ప‌రిస్థితి బొమ్మ‌రిల్లు సినిమాలో సిద్ధార్థ‌లా త‌యారైంది. నా సోష‌ల్ మీడియా ఐడీలో పేరు చివ‌ర రెడ్డి అని లేక‌పోతే జ‌రిగే న‌ష్ట‌మేంటి..? దేశ ప్ర‌ధాని పూర్తి పేరు న‌రేంద్ర దామోద‌ర్ దాస్ మోడీ.. సోష‌ల్ మీడియాలో న‌రేంద్ర‌మోడీ అని పెట్టుకున్నారు.. ఏపీ డిప్యూటీ సీఎం పేర్తిపేరు కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్.. కానీ సోషల్ మీడియా ఐడీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని పెట్టుకున్నారు. అంటే వీరిద్ద‌రు కులం మారిపోయిన‌ట్టా..?, హోంమంత్రి లెక్క ప్ర‌కారం.. మోడీ, ప‌వ‌న్ వారి పేర్ల‌ను షార్ట్ చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకుంటున్నారా..? అని ప్ర‌శ్నించారు విజ‌య్ కేస‌రి.

స్వాతి రెడ్డి పేరుతో శ్వేతా చౌదరి అనే యువతితో విదేశాల నుంచి వైసీపీ నేతలు ప్రధానంగా.. జగన్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోని పోస్టులు, వీడియోలు పెట్టించారని వైసీపీ నేత‌ల ఆరోప‌ణ‌. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఆమె కులం పేరు మార్చి సోషల్ మీడియాలో రెడ్డిగా ప్రచారం పేర్కొంటూ.. విప‌రీతంగా దుష్ప్ర‌చారం చేయించార‌నే అప‌వాదు తెలుగుదేశం పార్టీ మూట‌క‌ట్టుకుంది. పేర్లు మార్చి త‌ప్పుడు ప్ర‌చారం చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీకే ఉంద‌ని వైసీపీ శ్రేణులు సోష‌ల్ మీడియాలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment