ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddharth Luthra) కు రూ.2.86 కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రభుత్వం తరఫున ఆయన కేసులు వాదించినందుకు గానూ భారీ మొత్తంలో ఆయన ఫీజులు చెల్లించింది. ఏపీ హైకోర్టు (AP High Court)లో న్యాయవాది లూథ్రా ప్రభుత్వం తరఫున నాలుగు కేసులు వాదించారు. ఇందుకు గానూ ప్రభుత్వం రూ.2.86 కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలో లాయర్ సిద్దార్థ లూథ్రా క్లర్క్ (Siddharth Luthra Clerk) కు రూ.26 లక్షలు చెల్లించారు. భారీ మొత్తంలో చెల్లింపులు (Payments) జరిపినట్లుగా ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
అన్నీ వైసీపీ నేతలపై కేసులే..
మంగళగిరి (Mangalagiri) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో రూ.1.25 కోట్లు, చంద్రబాబు (Chandrababu) ఇంటి వద్ద ఘర్షణ కేసులో రూ.60 లక్షలు, గన్నవరం టీడీపీ (TDP) ఆఫీస్‌పై దాడి కేసులో రూ.10 లక్షలు, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghu Ramakrishna Raju) కేసులో రూ.65 లక్షలు చెల్లించారు. వీటిలో అదనంగా లాయర్ సిద్ధార్థ లూథ్రా క్లర్క్‌కు రూ.26 లక్షలు చెల్లించారు. ఇవన్నీ వైసీపీ (YCP) నేతలకు వ్యతిరేకంగా నమోదైన కేసులే కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌పై దాడి కేసులో వాదనలు వినిపించినందుకు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు జరపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు ‘స్కిల్‘ లాయర్ లూథ్రా
వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబుపై నమోదైన స్కిల్ స్కామ్ (Skill Scam), ఫైబర్ నెట్ స్కామ్ (Fiber Net Scam), అమరావతి స్కామ్ (Amaravati Scam) కేసుల్లో సిద్దార్థ లూథ్రా ఆయన తరఫున కోర్టుల్లో వాదనలు వినిపించారు. తన కేసుల కోసం చంద్రబాబు సిద్దార్థా లూథ్రాను ఢిల్లీ (Delhi) నుంచి పిలిపించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీ ప్రభుత్వం (AP Government) తరఫున కేసుల్లో వాదనలు వినిపించేందుకు సిద్దార్థ లూథ్రాను ప్రభుత్వం నియమిస్తోంది.








