ఉచిత బ‌స్సుపై ఏపీ మంత్రి సంచ‌ల‌న‌ ప్రకటన

ఉచిత బ‌స్సుపై మంత్రి సంచ‌ల‌న‌ ప్రకటన

తెలంగాణ‌ (Telangana), క‌ర్ణాట‌క‌ (Karnataka)లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వాల (Congress Government) ప‌థ‌కాన్ని ఏపీలోని ఎన్డీయే (NDA) కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government) అతి త్వ‌ర‌లో అమ‌లు చేయ‌నుంది. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఏపీ (AP) ర‌వాణా శాఖ (Transport Department) మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి (Ramprasad Reddy) వివ‌రించారు. ఏపీలోనిమహిళలకు (Women) ఉచిత బస్సు (Free Bus) ప్రయాణం ఆగ‌స్టు 15వ తేదీన ప్రారంభించ‌నున్న‌ట్లుగా తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. మొత్తం 74 శాతం వరకు నడిచే 6700 బస్సులు అంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఆర్డినరీ, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బ‌స్సుల్లో ఈ పథకం పరిధిలోకి రానున్నట్లు ఆయ‌న తెలియ‌జేశారు.

తెలంగాణ‌లో మ‌హాల‌క్ష్మి పేరుతో కొన‌సాగుతున్న ఈ ప‌థ‌కాన్ని ఏపీలో ‘స్త్రీశక్తి’ కొన‌సాగించ‌నున్నారు. ఆగ‌స్టు 15న ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు (Chandrababu) ఉచిత బ‌స్సు ప‌థ‌కాన్ని ప్రారంభించనున్నారు. ప్రయాణ సమయంలో ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు చూపించి ఉచితంగా బ‌స్సుల్లో ప్ర‌యాణించ‌వ‌చ్చని మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.

ర‌ద్దీ పెరిగితే స్కూల్ బ‌స్సులు
ఫ్రీ బస్సుల్లో ప్రయాణంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు. రద్దీ పెరిగితే స్కూల్ బస్సులు వినియోగించనున్నామని, అయితే పాఠశాల వేళల్లో అవి వాడబోమ‌ని చెప్పారు. డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకాలను త్వరితగతిన చేపట్టనున్నామని తెలిపారు. ఇక ఆగస్ట్ 15 తర్వాత ఆటో డ్రైవర్ల కోసం మరో ప్రత్యేక పథకాన్ని కూడా తీసుకురానున్నట్టు మంత్రి ప్రకటించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment