లోకేష్ హామీ.. పెట్రోల్ భారం ఏపీలోనే అధికం

లోకేష్ హామీ.. పెట్రోల్ భారం ఏపీలోనే అధికం

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో పెట్రోల్ (Petrol) ధరలు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇండియా టెక్ అండ్ ఇన్‌ఫ్రా (India Tech And Infra)  అనే ఎక్స్ హ్యాండిల్(X Handle) ఏపీ పెట్రోల్ బాదుడు బాగోతాన్ని బ‌య‌ట‌పెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.04 ఉండగా, గుజరాత్‌లో అది రూ.94.65 మాత్రమే. ఈ భారీ వ్యత్యాసం వాహనదారులపై భారం మోపుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే(NDA) భాగ‌స్వామ్య పార్టీలే అధికారంలో ఉండ‌గా, ఇంత‌టి వ్య‌త్యాసం ఏంట‌ని వాహ‌న‌దారులు ప్ర‌శ్నిస్తున్నారు. ఏకంగా లీట‌ర్‌కు దాదాపు రూ.15 వ్య‌త్యాసం ఉండ‌డంపై వాహ‌న‌దారులు అవ‌క్క‌వుతున్నారు.

ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ ఏమైంది..?
ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్‌(Nara Lokesh).. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఇంధన ధరలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోల్ బంకుల ముందు నిలబడి సెల్ఫ్ ఛాలెంజ్ చేసిన లోకేష్‌.. ఇప్పుడు మౌనం వహించడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్ ప్ర‌భుత్వం వాహ‌న‌దారుల ర‌క్తాన్ని పీల్చేస్తుంద‌ని ఆరోప‌ణ‌లు చేసిన నారా లోకేష్‌(Nara Lokesh).. అధికారంలోకి వ‌చ్చాక‌.. ఇంధ‌న ధ‌ర‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంపై వాహ‌న‌దారులు మండిప‌డుతున్నారు. ఒక్క రూపాయి కూడా తగ్గించన్నపుడు ఎందుకీ క‌ల్ల‌బొల్లి మాట‌లు చెప్ప‌డం అని సామాన్యులు గుర్రుమంటున్నారు.

సెస్ చార్జీల భారం..
రాష్ట్ర ప్ర‌భుత్వం వివిధ ట్యాక్స్‌(Tax)ల పేరుతో వాహ‌న‌దారుల జేబుల‌కు చిల్లుపెడుతోంద‌ని, రోడ్లు, పొల్యూష‌న్ అంటూ సెస్ చార్జీలు వ‌సూలు చేస్తోంద‌ని కొంద‌రు నెటిజ‌న్లు పెట్రో ధ‌ర‌ల‌పై వారి అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తుండ‌గా, డ‌బ్బులు వ‌సూలు చేసిన ప్ర‌భుత్వం స‌రిగ్గా రోడ్లు ఎందుకు నిర్మించ‌డం లేద‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలు బెంగ‌ళూరు, తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువ‌గా వ‌సూలు చేస్తున్నార‌ని నారా లోకేష్‌కు కంపట్లేదా అంటూ వైసీపీ శ్రేణులు సెటైర్లు పేలుస్తున్నారు.

ఇటీవ‌ల బ‌య‌ట‌పెట్టిన భూమ‌న అభిన‌య్‌
అధికారం దక్కించుకోవడానికి నారా లోకేష్ అబ‌ద్ధాలు చెప్పార‌ని, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ నియోజ‌క‌వ‌ర్గం కుప్పం సాక్షిగా పెట్రోల్ పై జ‌రుగుతున్న మోసాన్ని ఇటీవ‌ల వైసీపీ తిరుప‌తి ఇన్‌చార్జ్ భూమ‌న అభిన‌య్‌ బ‌య‌ట‌పెట్టారు. ఎన్నికల ముందు నారా లోకేష్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, దానికి జగన్ ప్రభుత్వమే కారణమని చెప్పారని, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ బోర్డర్‌కి వెళ్లి, బంక్‌ల దగ్గర నిలబడి, దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాయని లోకేష్ చెప్పార‌ని గుర్తుచేశారు. కూట‌మి ఏడాది పాల‌న సంద‌ర్భంలో అదే ఏపీ బార్డ‌ర్‌లోని క‌ర్ణాట‌క, కుప్పం బంకుల్లోకి వెళ్లి పెట్రోల్ ధ‌ర వ్య‌త్యాసాన్ని బ‌య‌ట‌పెట్టారు.

బ‌య‌ట‌పెట్టిన టెక్ అండ్ ఇన్‌ఫ్రా..
తాజాగా ఇండియా టెక్ అండ్ ఇన్‌ఫ్రా అనే ఎక్స్ హ్యాండిల్ ఏపీ పెట్రోల్ ధ‌ర‌ల‌ బాగోతాన్ని బ‌య‌ట‌పెట్టడంతో ఈ అంశం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేంద్ర ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యగా ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తుందా..? ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి నారా లోకేష్ చొర‌వ తీసుకొని వాహ‌న‌దారుల‌కు మేలు చేస్తారా..? లేక అధికారంలోకి రావ‌డానికి స‌హ‌జంగా రాజ‌కీయ నాయ‌కులు ఇచ్చిన హామీల్లాగే పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల త‌గ్గుద‌ల హుళ‌క్కేనా..? అనేది వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment