ఏపీని వణికిస్తున్న భానుడు.. మరో 5 రోజులు నిప్పుల కొలిమే!

ఏపీని వణికిస్తున్న భానుడు.. మరో 5 రోజులు నిప్పుల కొలిమే!

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సూర్యుడు ప్రతాపం చూపిస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఏపీలో మరో ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణా జిల్లాలోని కంకిపాడు, పెనమలూరులలో ఏకంగా 48.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. కృష్ణా జిల్లా (కంకిపాడు, పెనమలూరు)లో అత్య‌ధికంగా 48.1°C న‌మోదు అయ్యింది. బాపట్ల (కూచినపూడి)లో 46.4°C, ఎన్టీఆర్ జిల్లా (ఇబ్రహీంపట్నం), పల్నాడు (పిడుగురాళ్ల)లో 46.3°C, ఏలూరు (కుక్కునూరు), ఏలూరు (పోలవరం పరిధి కూనవరం)లో 46.1°C, పశ్చిమగోదావరి (తాడేపల్లి)లో 45.7°C, ప్రకాశం (కొప్పెరపాడు)లో 45.4°C, కోనసీమ (శివల), కాకినాడ (కాజులూరు)లో 45.2°C, గుంటూరు (మంగళగిరి)లో 44.9°C, మార్కాపురం (నందనమారెళ్ల)లో 44.7°C, విశాఖపట్నం (ములగాడ)లో 44.4°C, తూర్పుగోదావరి (పోతవరం)లో 44.3°C న‌మోదైంది.

రేపు 163 మండలాలపై వడగాల్పుల ప్రభావం
మంగళవారం (మే 26న) ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుందని అధికారులు తెలిపారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 137 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మే 26 (మంగళవారం) ఉష్ణోగ్రతల అంచనా
45 – 46 డిగ్రీలు:
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు.

42 – 44 డిగ్రీలు: విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు.

40 – 42 డిగ్రీలు: శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు.

కొన్ని జిల్లాల్లో వర్ష సూచన
తీవ్రమైన ఎండల నడుమ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు స్వల్ప ఉపశమనం లభించే అవకాశం ఉంది. పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఎండలు మరియు వడగాల్పుల తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment