Healthcare in crisis.. 2025 ends with Public Health System in Ruins

Healthcare in crisis.. 2025 ends with Public Health System in Ruins

From model welfare healthcare to mass privatization, a year that pushed medical care beyond the reach of the poor As 2025 draws to a close, Andhra Pradesh’s healthcare sector stands deeply shaken. What was once projected nationally as a model of inclusive, people-centric healthcare has been systematically dismantled under the present coalition government. Over the past year, public healthcare institutions have weakened, welfare schemes have been diluted, and access to affordable treatment has steadily slipped out of reach for lakhs of families. The year witnessed the collapse of village-level healthcare, erosion of flagship welfare programmes, aggressive moves toward privatization of medical education, and a sharp decline in emergency and hospital services. Healthcare, once treated as a right, has increasingly become a privilege.

From Welfare to withdrawal: Healthcare becomes costly in 2025

In 2025, medical treatment in Andhra Pradesh turned into a financial burden for ordinary citizens. The philosophy that no family should suffer because treatment costs exceed Rs. 1,000, a cornerstone of the previous government’s healthcare policy, has been abandoned. Village Clinics were weakened, Family Doctor services discontinued, health camps stopped, and Aarogyasri payments delayed or curtailed. Hospitals began refusing patients as dues piled up. The cumulative impact has been a loss of public trust in the government healthcare system.

Aarogyasri in crisis: Rs. 3,600 cr dues push hospitals to brink

One of the gravest developments of the year has been the near-collapse of the Aarogyasri scheme.

  • Monthly requirement to run the scheme: Rs. 300 crore
  • Total required for 18 months: Rs. 5,400 crore
  • Amount released: only Rs. 1,800 crore
  • Pending dues: over Rs. 3,600 crore

As a result, many network hospitals either restricted or completely stopped Aarogyasri services. Poor patients were left with no option but to postpone treatment or borrow heavily.Emergency services too came under strain. The 108 and 104 ambulance systems were reportedly handed over to favoured private agencies with limited financial capacity, leading to unpaid staff, idle vehicles, and delayed emergency response.

Medical colleges pushed towards privatization

A major controversy in 2025 revolved around the government’s move to privatise public medical colleges. Even as a statewide movement opposing privatization gathered momentum, the government continued on its course. Newly established government medical colleges were proposed to be run under PPP mode, while staff salaries were promised to be borne by the government, a move critics describe as a “bonanza for private players at public cost.” More controversially, the government officially wrote to the National Medical Commission (NMC) expressing unwillingness to take MBBS seats, an unprecedented step in the country’s medical education history.

Loss of MBBS seats: A blow to students

The consequences were severe:

  • In 2025 alone, 700 MBBS seats were lost
  • Another 1,750 seats were cut the following academic cycle
  • Total loss in two years: 2,450 MBBS seats

Five new government medical colleges were blocked from receiving approvals. Permissions for seven upcoming colleges were stalled, denying students nearly 1,800 seats. Even Pulivendula, which had secured approval for 50 MBBS seats from NMC, saw those seats blocked through official correspondence. The contrast with neighbouring Telangana was stark, where students secured seats with significantly lower NEET scores, while Andhra Pradesh students with higher marks were left without admission.

Teaching Hospitals weakened

Four major teaching hospitals: Pulivendula, Madanapalle, Markapur and Adoni saw removal of advanced equipment and redistribution of senior doctors. Services deteriorated rapidly, strengthening allegations that hospitals were being deliberately weakened to justify privatization.

Several incidents highlighted the collapse:

  • Power outages at Visakhapatnam KGH forced doctors to treat patients using mobile phone torches.
  • In Pithapuram, a Primary Health Centre remained locked, and the delayed arrival of an ambulance reportedly led to a patient’s death.
  • In another shocking incident, a security guard was found performing medical procedures due to lack of staff.

 

PG seats turned into paid commodities

Despite earlier promises to abolish self-financing quotas, the government approved PG seat fees up to Rs. 29 lakh per seat in newly established government medical colleges. This move effectively commercialised postgraduate medical education, shutting out students from middle- and lower-income backgrounds.

What existed before: A healthcare Model built under YS Jagan

The contrast with the previous YSRCP government remains stark.

Expansion of Healthcare Coverage

  • Aarogyasri procedures expanded from 1,000 to 3,257
  • Coverage increased up to Rs. 25 lakh per family
  • Eligibility extended to families earning up to Rs. 5 lakh annually
  • 4.25 crore people brought under coverage

Hospital Network growth

  • Empanelled hospitals increased from 820 to 2,543
  • 2,309 hospitals within Andhra Pradesh
  • 204 hospitals outside the state (Hyderabad, Bengaluru, Chennai)

Massive beneficiary reach

  • Over 53 lakh patients received free treatment
  • Rs. 1,310 crore provided under Aarogya Asara income support
  • Rs. 1,900 crore spent on cancer care alone
  • High-cost treatments such as organ transplants, bone marrow transplants and cochlear implants included

Emergency services strengthened earlier

Before 2019: 108 ambulances: 336 , 104 vehicles: 292

Under YS Jagan:

  • 108 ambulances: 768, 104 vehicles: 936, Mother & Child ambulances: 500
  • Total: 2,204 emergency vehicles

Historic expansion of Medical colleges

  • Only 12 government medical colleges existed before 2019
  • 17 new government medical colleges were sanctioned under YS Jagan
  • Objective: one medical college per parliamentary constituency
  • Today, many of these colleges face privatization or stalled development

Unprecedented recruitment drive

  • 53,126 doctors, nurses and health staff recruited
  • Specialist doctor shortage reduced to 3.96% (national average: 61%)
  • Nursing shortage brought down to zero
  • Lab technician shortages eliminated

WHO-standard Medicines and village clinics

  • Medicines expanded from 292 to 562 WHO-GMP–certified drugs
  • 10,032 Village Health Clinics established
  • Each clinic equipped with:
    • Community Health Officer
    • ANM
    • ASHA workers
    • 105 medicines
    • 14 diagnostic tests

Family Doctor & Health Camp Model

  • Family Doctor system ensured doorstep care
  • Two PHCs per mandal with rotating doctors
  • Regular village visits every month
  • Health camps conducted every six months
  • Over 60 lakh people screened
  • 2.4 lakh new BP cases detected and treated
  • Preventive healthcare strengthened at scale

A System dismantled

By the end of 2025, Andhra Pradesh’s healthcare system stands at a crossroads. A structure once praised nationally for accessibility, affordability, and innovation has been steadily hollowed out. Privatization, policy reversals, funding delays, and administrative neglect have replaced welfare-driven governance. For millions of poor and middle-class families, healthcare has once again become uncertain, expensive, and out of reach. As the year closes, public sentiment reflects a growing demand for the restoration of a system that once placed people before profit — and health before politics.

వైద్యరంగం నిర్వీర్యం @ 2025

– వైద్యాన్ని నిరుపేదలకు దూరం చేసేలా కూటమి సర్కార్ అడుగులు

– విలేజ్ క్లినిక్స్ నుంచి ఆరోగ్యశ్రీ దాకా సర్వనాశనం, విధ్వంసం

– 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు కట్టబెట్టేలా దుర్మార్గపు చర్యలు

– ఎంబీబీఎస్ సీట్లు వద్దంటూ ఏకంగా ఎన్ఎంసీకి లేఖ రాసి బరితెగింపు

– రూ.25 లక్షలు కాదు.. రూ.2.5 లక్షలకే ఆరోగ్యశ్రీ పరిమితం

– ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3,600 కోట్లపైనే.., ఆరోగ్య ఆసరా ఎత్తివేత

– ఆస్పత్రుల్లో నాడు-నేడుకు మంగళం, వైద్య సిబ్బంది నియామకాలకు స్వస్తి

– ఆరోగ్య సురక్ష శిబిరాల ఊసే లేదు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లోజ్

– డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలతో మందుల్లేవు, దూదికీ దిక్కులేని దౌర్భాగ్యపు పాలన

– 108, 104 సేవలు మృగ్యం.. అనుయాయులకే కాంట్రాక్టులు

– వైద్యరంగాన్ని పూర్తిగా అటకెక్కించి ప్రైవేటు జపం చేస్తున్న చంద్రబాబు సర్కార్

– 2025 సంవత్సరంలో పేదలకు అందని ద్రాక్షగా మారిన వైద్యం

– వైయస్ జగన్ హయాంలో చేసిన ఏ మంచీ కొనసాగించకుండా మోసం

ఆంధ్రప్రదేశ్ లో పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది. 2025 సంవత్సరం వైద్యం అంటేనే పేదవాడికి మరింత భారంగా మారింది. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే కార్పొరేట్ స్థాయి నాణ్యమైన వైద్యం ఉచితంగా పేదలకు అందించాలనే సమున్నత లక్ష్యంతో గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బృహత్తర కార్యక్రమాలన్నీ నేడు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రభుత్వ వైద్యంపై పూర్తిగా ప్రజలు విశ్వాసం కోల్పోయే పరిస్థితి దాపురించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, విలేజ్ క్లినిక్స్ నిర్వీర్యం, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఆరోగ్య ఆసరా ఎత్తివేత, నాడు-నేడు ఆస్పత్రుల అభివృద్ధికి మంగళం, ఆరోగ్య సురక్ష శిబిరాల ఊసే లేదు, 104, 108 వాహనాల నిర్వీర్యం, దూదికీ దిక్కులేని పరిస్థితులు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎత్తివేత, వైద్య సిబ్బంది నియామకాలు స్వస్తి.. ఇదీ నేటి దుస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే వైద్య రంగాన్ని పూర్తిగా నాశనం చేసిన పాలన సాగుతోంది.

పేరుకుపోతున్న ఆరోగ్యశ్రీ బకాయిలు

ఈ ప్రభుత్వానికి ఇంకో మాయరోగం వచ్చింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు. బకాయిలు ఇవ్వకపోవడంతో ఆస్పత్రుల్లో సేవలన్నీ దాదాపుగా నిలిచిపోయాయి. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు దాదాపు నిల్చిపోయాయి. ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు రూ.300 కోట్లు అవుతుంది. 18 నెలలకు రూ.5400 కోట్లు. ఇచ్చింది కేవలం రూ.1800 కోట్లు. మొత్తం ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3,600 కోట్లు. నిజంగా పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. 104, 108 కూడా స్కాముగా మార్చేశారు. రూ.5 కోట్లు నికర టర్నోవర్‌ లేని సంస్థకు ఇచ్చారు. వాళ్ల తెలుగుదేశం ఆఫీసులో డాక్టర్ల సెల్‌ అధ్యక్షుడికి కట్టబెట్టారు.

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ

ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా హతం చేస్తూ ఇంకోవైపు గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కాముగా మారుస్తున్నారు. కొత్త గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం ఒక స్కాము అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాంజా ఇచ్చారు. అది ఇంకో పెద్ద స్కామ్‌. ఆ కాలేజీలు ప్రైవేట్‌ పరం అయ్యాక అందులో పని చేస్తున్న సిబ్బందికి గవర్నమెంట్‌ జీతాలు ఇస్తుందని చెప్పడం నయా స్కామ్. ఒకపక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు జరుగుతున్నా చంద్రబాబు సర్కార్ వెనకడుగు వేయడం లేదు. సిగ్గు లేకుండా, ప్రజా ఉద్యమాన్ని ఖాతరు చేయకుండా చంద్రబాబు స్కాముల పర్వం ముందుకు పోతోంది.

ఆరోగ్య ఆసరా ఎత్తేశారు

ఆరోగ్య ఆసరా పూర్తిగా ఎత్తేశారు. మందుబిళ్లలకూ దిక్కులేని పరిస్థితి తెచ్చారు. వైద్య సిబ్బంది నియామకాలు లేవు. టెలిమెడిసిన్ సేవలు అంతంతమాత్రమే. 104, 108 వాహనాల డ్రైవర్లకూ జీతాలివ్వకుండా సతాయిస్తున్న పరిస్థితి ఏర్పడింది. వాహనాల కుయ్యో మొర్రో అంటున్నాయి. విలేజ్ క్లినిక్స్ లో వైద్య సేవలకు గ్రహణం పట్టించారు. మెడికల్ సీట్లు వద్దంటూ ఏకంగా ఎన్ఎంసీకి లేఖ రాసిన దుస్థితి వచ్చింది. ఫ్యామిలీ డాక్టర్ ఎత్తేశారు. ఆరోగ్య సురక్ష శిబిరాలు రద్దు చేశారు. ఆరోగ్యశ్రీని ప్రైవేట్ బీమా కంపెనీలకు కట్టబెట్టి.. పేదలకు వైద్యం దూరం చేస్తున్నారు. ఆశా కార్యకర్తల గోడు పట్టించుకోవడం లేదు. ఇలా అన్ని రకాలుగా వైద్యరంగాన్ని చంద్రబాబు సర్కార్ భ్రష్టుపట్టించింది.

2025 సంవత్సరం చోటుచేసుకున్న ముఖ్యమైన పరిణామాలు ఇవీ..

05.09.2025

ఒకవైపు ఆరోగ్యశ్రీకి తూట్లు. మరోవైపు 10 కొత్త మెడికల్ కాలేజీలు పీపీపీకి కట్టబెడుతూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం.

12.09.2025

వైద్యవిద్య కల ఛిద్రం. ఇకపై ప్రైవేట్ మెడిసిన్. 5 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చంద్రబాబు సర్కారు మోకాలడ్డు. ప్రైవేట్ కు కట్టబెట్టేందుకు అనుమతులను అడ్డుకుని విద్యార్థుల ఆశలపై నీళ్లు. బాబు ప్రైవేట్ మోజుతో ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయిన రాష్ట్రం. పులివెందులకు ఎన్ఎంసీ మంజూరు చేసిన 50 సీట్లను ఏకంగా లేఖ రాసి అడ్డుకున్న చంద్రబాబు సర్కార్. వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన 7 కాలేజీల పనులూ అటకెక్కించిన వైనం. దీంతో మరో 1050 సీట్లు.. మొత్తంగా 12 కాలేజీల ద్వారా 1800 సీట్లు కోల్పోతున్న విద్యార్థులు. లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరం.

19.10.2025

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 106 పీజీ సీట్ల భర్తీకి జాతీయ వైద్య కమిషన్ ఆమోదం తెలిపిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. వీటిలో 5 కొత్త వైద్యకళాశాలల్లో 60 సీట్లు ఉన్నాయని తెలిపారు.

ఫలించిన వైయస్ జగన్ ప్రభుత్వ కృషి. రాష్ట్రంలోని 5 కొత్త ప్రభుత్వ కళాశాలలకు 60 సీట్లు. 2023-24లో 5 కాలేజీలు ప్రారంభించిన జగన్ ప్రభుత్వం. ఆ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరు చేసిన ఎన్ఎంసీ. 100కు పైగా సీట్లు రావడానికి అవకాశం. బాబు ప్రభుత్వ చిత్తశుద్ధి లేమితో 60 సీట్లే సమకూరిన వైనం. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తప్ప బలోపేతంపై దృష్టిపెట్టని చంద్రబాబు.

06.11.2025

కన్వీనర్ కోటా సీట్లకు కోత. ఏపీలో గతేడాది 700.. ఈ ఏడాది 1,750 ఎంబీబీఎస్ సీట్లు పోయాయ్. రెండేళ్లలో 2,450 మెడికల్ సీట్లు కోల్పోయిన మన విద్యార్థులు. సీట్లు పెరగకపోవడంతో మనకు తీవ్ర అన్యాయం. వైద్య విద్య కలలు ఆవిరి. తెలంగాణలో నీట్ ఓపెన్ కేటగిరీలో 406 మార్కులకే కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు. ఏీలో 484 మార్కులు వచ్చినా ఓసీ విద్యార్థులకు దక్కని కన్వీనర్ సీటు. బీసీ-ఏలో 341 మార్కులు వచ్చిన విద్యార్థికి తెలంగాణలో కన్వీనర్ సీటు. అదే విభాగంలో వందకు పైగా మార్కులు అదనంగా తెచ్చుకున్నా ఏపీ విద్యార్థులకు నిరాశే. దేశ చరిత్రలో మెడికల్ కాలేజీలు తమకొద్దని చెప్పి చరిత్రకెక్కింది చంద్రబాబు ఒక్కరే.

4 బోధనాస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు ఔట్. కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కు కట్టబెట్టేస్తూ ఆస్పత్రుల్లో సేవలకు మంగళం. పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని బోధనాస్పత్రులు నిర్వీర్యం. 4 చోట్ల ఆధునిక పరికరాలు తొలగించేస్తున్న కూటమి సర్కార్. ఆయా ఆస్పత్రుల్లోని సీనియర్ వైద్యులు పాత జీజీహెచ్ లకు సర్దుబాటు. పేదల ఆరోగ్య భద్రతకు గొడ్డలిపెట్టులా చంద్రబాబు సర్కారు నిర్ణయాలు.

03.12.2025

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇలాకా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పీహెచ్సీకి తాళాలు. సకాలంలో రాని 108 వాహనం. చికిత్స అందక ప్రత్తిపాడు మండలం శరభవరం గ్రామానికి చెందిన ఇమంది మాణిక్యం(51) మృతి.

05.12.2025

కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ సీటు ఫీజు రూ.29 లక్షలు. చంద్రబాబు సర్కారు నిర్ణయం. తాము అధికారంలోకి వస్తే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. గద్దెనెక్కిన తర్వాత విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారు. ఒకవైపు వైయస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ మరోవైపు ఆ కాలేజీల్లోని పీజీ సీట్లను అమ్మకానికి పెట్టారు. ఒక్కో పీజీ సీటు రూ.29 లక్షల వరకు వసూలుకు సీఎం ఆమోదం తెలిపారు.

02.12.2025

పిఠాపురంలో సెక్యూరిటీ గార్డే వైద్యుడు. వైద్యం, పోస్టుమార్టం చేస్తున్న సెక్యూరిటీ గార్డు. భయాందోళనకు గురవుతున్న రోగులు.

07.11.2025

విశాఖ కేజీహెచ్ లో అంధకారం. కొన్ని గంటల పాటు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. తీవ్ర ఇబ్బందులు పడ్డ రోగులు, సహాయకులు. సెల్ ఫోన్ టార్చ్ వెలుగులో వైద్యం చేసిన సిబ్బంది. ఐసీయూ, ఇతర వార్డుల్లో రోగుల కష్టాలు వర్ణనాతీతం.

=====

వైయస్ జగన్ హయాంలో మేటిగా వెలిగిన ఆరోగ్య రంగం

– 1000 నుంచి 3,257కు ప్రొసీజర్లు పెంపు

– పేద, మధ్య తరగతి వారికి బాసటగా నిలిచిన ఆరోగ్యశ్రీ

– పేద పిల్లల తెల్లకోటు ఆశల్ని సాకారం చేసేలా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం

– కుయ్.. కుయ్.. మంటూ 108, 104 పరుగులు.. కొత్త వాహనాలతో కళకళ

– 10132 విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో ఇంటి వద్దకే వైద్యం

– ఆరోగ్య సురక్ష శిబిరాలతో ఉచితంగా టెస్టులు, మందు బిళ్లలు

– 53 వేలకు పైగా వైద్య సిబ్బంది నియామకాలు

– డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలతో మందులు

– మొత్తంగా ఐదేళ్లలో వైద్య రంగంలో రూ.32,279 కోట్లకు పైగా వ్యయం

– వైద్యరంగంలో దేశానికే దిక్సూచిగా సాగిన వైయస్ జగన్ పాలన

వైద్యరంగం వైయస్సార్ సీపీ హయాంలో వైభవోపేతంగా అమలు జరిగి, పేద, మధ్య తరగతి ప్రజలకు బాసటగా నిలిచారు. పేదల తెల్లకోటు ఆశలను సాకారం చేసేలా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. వాటిలో 7 పూర్తి చేశారు. రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీని తీసుకునిపోయారు. పేదవాడు అప్పులపాలయ్యే పరిస్థితి నుంచి కాపాడారు. మొత్తంగా వైయస్సార్ సీపీ హయాంలో ఐదేళ్లలో వైద్య రంగంలో రూ.32,279 కోట్లకు పైగా వ్యయం చేశారు. జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, వ్యవస్థలన్నీ ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారు.

నాడు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం

– వైయస్సార్ సీపీ హయాంలో రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించిన పరిస్థితులు.

– దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికే కాకుండా నెలకు రూ.40 వేల వరకు ఆదాయం వస్తున్న కుటుంబాలకు కూడా అంటే రూ.5 లక్షలు వార్షికాదాయం ఉన్న వారికీ ఆరోగ్యశ్రీ వర్తింపు

– దీని వల్ల అక్షరాలా కోటీ 48 లక్షల కుటుంబాలు అంటే 4.25 కోట్ల జనాభాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు.

– వైయస్సార్ సీపీ ప్రభుత్వం రాక ముందు కేవలం 1,059 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిమితమై ఉండేది.

– వైయస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత చికిత్స ఖర్చు రూ.1000 దాటితే చాలు.. పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడని, అప్పులపాలయ్యే పరిస్థితి ఉండకూడదని తపపడి ఈ ప్రొసీజర్లను 3,257కు పెంచారు.

ఆస్పత్రుల సంఖ్య విస్తరణ

– వైయస్సార్ సీపీ అధికారంలోకి రాక ముందు కేవలం 820 ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు

– వైయస్ జగన్ సీఎం కాగానే 2,543 ఆస్పత్రులకు విస్తరించారు.

– మన రాష్ట్రంలోనే 2,309 ఆస్పత్రులకు అవైల్‌ చేశారు. హైదరాబాద్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఎక్కడున్నాయో, బెస్ట్‌ వైద్యం పేదవాడికి అందించాలనే ఉద్దేశంతో 85 ఆస్పత్రులు, బెంగళూరు 35 ఆస్పత్రులు, చెన్నై నగరంలో 16 ఆస్పత్రులు, మొత్తంగా 204 బయట రాష్ట్రాల్లో ఆస్పత్రులను ఎంపానల్‌ చేశారు.

53 లక్షల మందికిపైగా ఆరోగ్యశ్రీ సేవలు

– వైయస్సార్ సీపీ హయాంలో ఆరోగ్యశ్రీ సేవలు 53 లక్షల మందికిపైగా అందుకున్నారు.

– పేదవాడికి వైద్యం అందించడమే కాకుండా డాక్టర్లు పేదవాడు రెస్టు తీసుకోవాలని చెబితే, ఆరోజులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అన్ని రోజులపాటు నెలకు రూ.5 వేలచొప్పున ఆరోగ్య ఆసరా అందించారు.

– దీని ద్వారా 25,27,870 మందికి రూ.1,310 కోట్లు అందించారు.

ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరించింది

– వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సర్‌కు ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదని, అన్‌లిమిటెడ్‌గా పూర్తిగా వైద్యం అందించేందుకు శ్రీకారం చుట్టారు.

– రెండు చెవులకూ కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ చేయడానికి రూ.12 లక్షలు అవుతుందంటే అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు.

– బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌, ట్రెమ్‌షెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ రూ.11 లక్షలు, గుండెమార్పిడి చికిత్స రూ.11 లక్షలపైనే అయ్యేది. అంటువంటివన్నీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చిన ఘనత వైయస్ జగన్ ది.

– ప్రాణాంతకమైన ఈ వ్యాధులు దాదాపు 1,82,732 మందికి ఆరోగ్యశ్రీలో ఇటువంటి పెద్ద ఖర్చుతో కూడిన ప్రొసీజర్లు ఉచితంగా చేస్తూ తోడుగా నిలబడిన చరిత్ర వైయస్సార్ సీపీ హయాంలోనే.

– ఒక్క క్యాన్సర్‌కే ఏకంగా రూ.1,900 కోట్లు ఖర్చు చేసి పేదవాడికి తోడుగా నిలబడిన ఘనత వైయస్ జగన్ ది.

104, 108లకు ప్రాణం పోసిన జగన్

– గత చంద్రబాబు హయాంలో కేవలం 108 వాహనాలు 336. అంటే మండలానికి ఒకటి కూడా లేదు.

– 104 అయితే కేవలం 292 వాహనాలే. అన్నీ కలిపినా 622 వాహనాలు. అవికూడా సరిగ్గా పని చేయని పరిస్థితి ఉండేది.

– వైయస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే 108లో 768 వాహనాలు, 104లో 936 వాహనాలు, రెండూ కలిపితే 1,704 వాహనాలు సమర్థంగా పేదలకు సేవలందించాయి.

– తల్లీ బిడ్డ వాహనాలు 500 కలుపుకుంటే మొత్తంగా 2,204 వాహనాలు అందుబాటులో ఉంచారు.

మెడికల్ కాలేజీలు ఓ చరిత్ర

– వైయస్సార్ సీపీ అధికారంలోకి రాక ముందు గవర్నమెంట్‌ రంగంలో ఉన్న మెడికల్‌ కాలేజీలు కేవలం 12.

– జగన్ అధికారంలోకి రాగానే మరో 17 మెడికల్‌ కాలేజీలు రాష్ట్రంలో కట్టేందుకు శ్రీకారం

– ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేసి, ఒక మెడికల్‌ కాలేజీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు.

– నేడు ఆ 17 మెడికల్ కాలేజీలనూ ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు చర్యలు

– ఎంబీబీఎస్ సీట్లు వద్దంటూ ఏకంగా కేంద్రానికి లేఖ రాసిన దౌర్భాగ్యకర పరిస్థితి.

53 వేల మందికిపైగా నియామకాలు

– గవర్నమెంట్‌ ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు ఉండరు, పోయినా వేస్టే అన్న పరిస్థితులు పూర్తిగా మార్చిన వైయస్ జగన్

– గతంలో ఎప్పుడూ చూడని విధంగా 53,126 మంది నియామకం.

– కచ్చితంగా అందుబాటులో ఉండేట్టుగా అడుగులు పడ్డాయి.

– స్పెషలిస్ట్‌ డాక్టర్లు జాతీయ స్థాయిలో 61 శాతం కొరత.

– మన రాష్ట్రంలో స్పెషలిస్టు డాక్టర్ల కొరత కేవలం 3.96 శాతం.

– 27 శాతం జాతీయ సగటున నర్సుల కొరత ఉంటే మన రాష్ట్రంలో నర్సుల కొరత సున్నా. 100 శాతం ప్యాక్‌ చేసిన చరిత్ర జగన్ ది.

– ల్యాబ్‌ టెక్నీషియన్ల కొరత జాతీయ సగటున 33 శాతం. అదే మన రాష్ట్రంలో కొరత సున్నా.

డబ్ల్యూహెచ్ వో ప్రమాణాలతో మందులు

– గత చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆస్పత్రులకు పోతే మందులే ఉండని పరిస్థితి. నాసిరకం.

– గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో మందులు తింటే జబ్బులు నయం కాని పరిస్థితి.

– గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో ఇచ్చే ప్రతి మందూ డబ్ల్యూహెచ్‌వో జీఎంపీ స్టాండార్డ్స్‌కు మాత్రమే ఉండేట్టుగా అటువంటి క్వాలిటీ డ్రగ్స్‌ మాత్రమే ఉండేట్టుగా వైయస్సార్ సీపీ హయాంలో చర్యలు.

– గత చంద్రబాబు హయాంలో 292 రకాల మందులు కూడా పేరుకే ఉండేవి. వైయస్సార్ సీపీ హయాంలో 562 రకాల మందులు అందుబాటులోకి తెచ్చారు.

10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్

– ప్రివెంటివ్‌ కేర్‌లో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 10,032 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు సచివాలయాల పక్కనే అందుబాటులోకి తెచ్చిన చరిత్ర వైయస్ జగన్ ది.

– ఒక సీహెచ్‌వో, ఒక ఏఎన్‌ఎం, ముగ్గురు లేదా నలుగురు ఆశా వర్కర్లు, 24/7 సీహెచ్‌వోలు, ఏఎన్‌ఎంలు గ్రామంలోనే ఉండేట్లుగా ఏర్పాట్లు.

– 105 రకాల మందులు డిస్ట్రిబ్యూషన్‌. 14 రకాల డయాగ్నొస్టిక్‌ టెస్టులు చేసేవారు.

దేశంలోనే సంచలనం ఫ్యామిలీ డాక్టర్

– ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థను తీసుకొచ్చిన చరిత్ర వైయస్సార్ సీపీ హయాంలోనే.

– ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, వాటిలో కచ్చితంగా రెండు 104 వాహనాలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, మండలానికి నలుగురు డాక్టర్లు, ఇద్దరు డాక్టర్లు పీహెచ్‌సీలో పని చేస్తుంటే మిగిలిన ఇద్దరు గ్రామాలకు వెళ్లి చికిత్సలు చేసేలా చర్యలు.

– ప్రతి గ్రామానికి నెలకు రెండుసార్లు వెళ్లేట్టుగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తీసుకొచ్చారు.

ఆరోగ్య సుక్షతో గడపవద్దకే వైద్యం

– ఆరోగ్య సురక్ష దశల వారీగా అమలు చేసిన వైయస్సార్ సీపీ ప్రభుత్వం.

– ప్రతి గ్రామంలోనూ ప్రతి 6 నెలలకోసారి హెల్త్‌ క్యాంపులు.

– ఫేజ్‌ 1లో దాదాపు 50 రోజులు నిర్వహించారు. దీని వల్ల దాదాపు 60,27,843 మంది ఈ హెల్త్‌ క్యాంపులకు వచ్చి సేవలు పొందారు.

– ప్రతి ఇంట్లో రెండు మూడు పరీక్షలు చేశారు. బీపీ, షుగర్‌, హీమోగ్లోబిన్‌కు, అవసరాన్ని బట్టి యూరిన్‌ టెస్టులు ప్రతి ఇంట్లో చేశారు.

– కొత్తగా ప్రివెంటివ్‌ కేర్‌లో 2.40 లక్షల మందికి బీపీ లక్షణాలు కనిపించాయి. రీకన్ఫం టెస్టులు చేసి 56,648 మందికి మందులు కూడా అందించారు.

చంద్రబాబు సర్కారు నేడు ఆ మంచి వ్యవస్థలన్నీ సర్వనాశనం చేస్తోంది. అన్ని రకాలుగా వైద్యరంగాన్ని చంద్రబాబు సర్కార్ భ్రష్టుపట్టించింది. మళ్లీ జగన్ వస్తే తమకు నాణ్యమైన ఉచిత వైద్యం ఇంటివద్దకే వస్తుందంటూ పేదలు ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment