రాజధాని (Capital) అమరావతి (Amaravati) నిర్మాణ పనుల్లో వేగం పెంచిన కూటమి ప్రభుత్వం, రాజధాని విస్తరణపై కూడా దృష్టి సారించింది. దీనిలో భాగంగా భూ సమీకరణ (Land Pooling)కు సన్నాహాలు చేస్తోంది. రాజధాని కోసం భూములు సేకరించాలని భావిస్తున్న గుంటూరు (Guntur) జిల్లాలోని పలు గ్రామాల్లో గ్రామసభలు (Village Meetings) నిర్వహిస్తోంది. అయితే, రాజధాని విస్తరణ కోసం నిర్వహించిన రెండో విడత గ్రామసభలో అధికారులకు నిరసన సెగ తగిలింది.
తాడికొండ మండలం పొన్నెకల్లులో గ్రామసభ నిర్వహించడానికి వచ్చిన ఎమ్మెల్యే(MLA) శ్రావణ్ కుమార్ (Shravan Kumar) మరియు అధికారుల ఎదుట స్థానికులు నిరసనకు దిగారు. గ్రామసభ నిర్వహించడానికి వీల్లేదంటూ పొన్నెకల్లు రైతులు (Ponnekallu Farmers) ఆందోళన చేశారు. “ఎమ్మెల్యే, అధికారులు.. గో బ్యాక్.. గో బ్యాక్..!” అంటూ నినాదాలు చేశారు. దీంతో, తాడికొండ (Tadikonda) మండలం పొన్నెకల్లు గ్రామసభ ఉద్రిక్తంగా మారిపోయింది. భూసేకరణపై రైతుల వ్యతిరేకత ఈ సభలో స్పష్టంగా కనిపించింది.








